Telangana

BRS Party conducts panchanga sravanam in Telangana Bhavan KTR participates | BRS Panchanga Sravanam: తెలంగాణ భవన్‌లో పంచాంగ శ్రవణం, వాళ్లకి కష్టమేనట



Ugadi Celebrations in Telangana Bhavan: పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో పండితులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు.  క్రోది నామ సంవత్సరంలో రాజు కుజుడుగా ఉన్నాడని, శని మంత్రిగా ఉన్నాడని దీని వలన వాహన, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయన్నారు.  వ్యవసాయ రంగాలనిక అనుకూలంగా ఉంటుందన్నారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయన్నారు. ఈ సంవత్సరం ధరలు అధికమవుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులకు రాబోయే ఎన్నికల్లో పాలకపక్షంగా ఉన్నవారికి కొంత కష్టసాధ్యంగా ఉంటుందని తెలిపారు. ప్రతిపక్షంగా ఉన్నవారు ప్రయత్నిస్తే దిగ్విజయ ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తుందని చెప్పారు.
కేసీఅర్ నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందన్న పండితులు
కేసీఆర్‌ రాశి కర్కాటక రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2 గా ఉందని.. రాజపూజ్యం 6, అవమానం 6గా ఉందని తెలిపారు. గురుడు మంచి స్థానంలో ఉన్నాడని.. ఈ సంవ్సతరమంతా వీరికి బాగుంటుందని తెలిపారు. కెసిఅర్ చేసే వ్యవహరాల్లో మంచి విజయం చేకూరే అవకాశాలున్నాయని తెలిపారు. కెసిఅర్ నిర్ణయాలకు ప్రజాబలం లభిస్తుందని అన్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి ప్రతిష్ఠ ఉంటుందన్నారు. కెసిఅర్ మాటకు, గమనానికి ఈ ఏడాది అడ్డు ఉండదని అన్నారు. అయితే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని సూచించారు. 
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ది మకర రాశి అని.. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉందని, రాజ్యపూజ్యం 3, అవమానం 1 గా ఉందని పండితులు తెలిపారు. ఈ రాశి వారు ఏ పనిచేసినా బ్యాలెన్స్‌గా చేయాలని సూచించారు.  ఈ రాశి వాళ్లు ప్రజలు, పార్టీలో అందరి అభిమానాన్ని పొందగలుగుతారని అన్నారు. జాగ్రత్తగా ఉంటే ఎన్నికల్లో మంచి పట్టు సాధించే అవకాశం ఉందన్నారు. 
తెలుగు వారందరకీ ఉగాది శుభాకాంక్షలు- బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌పంచంలోని తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ కెటిఅర్ శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌ర ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. తెలంగాణ భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ఉగాది వేడుక‌ల్లో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ‌కీయాలు ఎప్పుడూ ఉంటాయి. పండుగ‌పూట రాజ‌కీయాలు మాట్లాడ‌కూడ‌దు. ఈ సంవ‌త్స‌రం అంద‌రికీ మంచి జ‌ర‌గాలి. మ‌త‌క‌ల్లోలాలు లేకుండా ప్ర‌జ‌లంద‌రూ శాంతియుతంగా ఉండాలి. వ్య‌వ‌సాయం బాగుండాలి. వాతావ‌ర‌ణ అనుకూల ప‌రిస్థితులు రావాల‌ని కేటీఆర్ ఆకాంక్షించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Minister Seethakka turns into Teacher in Jagganna peta of Mulugu district

Oknews

Telangana Election 2023 : ఎల్లారెడ్డిలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు.. హస్తం గూటికి ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి..?

Oknews

YSRCP pulls Dasari Sai Kumari or Kumari aunty food point into political stream Tweets goes viral | Kumari Aunty Food Point: కుమారి ఆంటీ‌పై పొలిటికల్ గేమ్

Oknews

Leave a Comment