Interim Budget 2024: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitha Raman) దేశ మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024 )ను ప్రవేశపెట్టారు. తన ప్రసంగంలో మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. జనాభాలో సగం మందిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.
అందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లఖ్‌పతి దీదీ పథకాన్ని(Lakhpati Didi Scheme ) ప్రస్తావించారు. తమ ప్రభుత్వం లఖ్పతి దీదీని విపరీతంగా ప్రోత్సహిస్తోందని చెప్పారు. కోటి మందిని మిలియనీర్‌గా తీర్చి దిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పుడు దాన్ని మరింత దూకుడుగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆ పథకాన్ని మరో రెండు కోట్ల మందికి వర్తింప జేయబోతున్నట్టు వెల్లడించారు.
ఇంతకీ లఖ్పతి దీదీ యోజన అంటే ఏమిటి. దాని వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది. ఆ పథకానికి ఎవరు అర్హులో తెలుసుకుందాం.
లఖ్పతి దీదీ స్కీమ్ అంటే ఏమిటి?
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం లక్ష్పతి దీదీ పథకాన్ని ప్రారంభించింది. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం నుంచి వచ్చిన మహిళలను ఆర్థికంగా చేదోడుగా నిలవడమే దీని ముఖ్య ఉద్దేశం. లఖ్పతి దీదీ పథకం కోట్ల మంది మహిళల జీవితాలను మార్చిందని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. వారు స్వయం సమృద్ధి సాధించారు.
లఖ్పతి దీదీ 10 ప్రయోజనాలు
1. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి సమగ్ర ఆర్థిక అక్షరాస్యత వర్క్ షాప్‌లను నిర్వహిస్తారు. దీని నుంచి బడ్జెట్, పొదుపు, పెట్టుబడి వంటి విషయాలకు సంబంధించిన సమాచారం అందిస్తారు.
2. ఈ పథకంలో పొదుపు చేయడానికి మహిళలను ప్రోత్సహిస్తారు.
3. లఖ్పతి దీదీ పథకంలో మహిళలకు సూక్ష్మ రుణ సదుపాయం కల్పిస్తారు. దీనిలో వారికి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తారు.
4. స్కిల్ డెవలప్మెంట్, ఒకేషనల్ ట్రైనింగ్‌పై ఈ స్కీమ్ దృష్టి పెడుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మహిళలను తీర్చి దిద్దుతారు. వ్యాపారం ప్రారంభించేందుకు వారికి మార్గనిర్దేశం చేస్తారు.
5. ఈ పథకంలో మహిళలకు ఆర్థిక భద్రత కూడా కల్పిస్తారు. ఇందుకోసం సరసమైన బీమా కవరేజీ ఇస్తారు. ఇది వారి కుటుంబ భద్రతను కూడా పెంచుతుంది.
6. లఖ్పతి దీదీ పథకం మహిళలకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, మొబైల్ వాలెట్లు, ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను చెల్లింపుల కోసం ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తుంది.
7. ఈ పథకంలో అనేక రకాల సాధికారత కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు, ఇది మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది.
అన్ని వర్గాలపై దృష్టి సారించిన ఆర్థిక మంత్రి
అందరికీ ఇళ్లు, ప్రతి ఇంటికీ నీరు, అందరికీ విద్యుత్, అందరికీ వంటగ్యాస్, అందరికీ బ్యాంకు ఖాతాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు రికార్డు సమయంలో జరిగాయని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఆర్థిక సేవల ద్వారా ప్రతి ఇంటిని, వ్యక్తిని ఆర్థికంగా నిలదొక్కుకోవడంపై దృష్టి సారించింది. ప్రభుత్వం సాధించిన విజయాలను లెక్కించిన ఆర్థిక మంత్రి, భవిష్యత్తులో అభివృద్ధి చెందిన భారతదేశం రోడ్ మ్యాప్ రూపొందించడానికి కూడా ఈ బడ్జెట్ సహాయపడుతుందని అన్నారు.
మరిన్ని చూడండి