ByGanesh
Fri 23rd Feb 2024 07:37 PM
రాష్ట్రం ఏదైనా సరే.. కొన్ని ప్రాంతాలు మాత్రం హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి. ఏపీలో ఇప్పుడు ఒక ప్రాంతం హాట్ టాపిక్ అవుతోంది. అదే విజయనగరం జిల్లా బొబ్బిలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టుంది. ఇప్పుడు టీడీపీ, వైసీపీలు హవా కొనసాగిస్తున్నాయి. ఈ సీటును 2019లో వైసీపీ గెలుచుకుంది. అయితే అప్పుడు వైసీపీకి బొబ్బిలి రాజులు సహకారం అందించారు. ఈ సారి బొబ్బిలి రాజులు టీడీపీలో చేరారు. పైగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల శంఖారావం సభ నిర్వహించి కార్యకర్తల్లో ఫుల్ జోష్ అయితే తీసుకురాగలిగారు. దీంతో ఇప్పుడు టీడీపీ అక్కడ మాంచి ఊపు మీదుంది. పార్టీ గ్రాఫ్ కూడా బీభత్సంగా పెరిగింది.
శంబంగికే టికెట్ ఇవ్వాలంటున్న బొత్స..
ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి కూడా ఫిక్స్ అయిపోయారు. మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావు సోదరుడు బేబీ నాయన ఈసారి టీడీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. మరోవైపు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకత కూడా దారుణంగా పెరిగింది. అయితే వైసీపీకి ఆయన మినహా మరో ఛాన్స్ లేదని అంటున్నారు. వైసీపీ నుంచి అభ్యర్థుల జాబితాలు ఏడు విడుదలైనా కూడా సీఎం జగన్.. బొబ్బిలి స్థానాన్ని మాత్రం టచ్ చేయలేదు. ఇక బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే శంబంగి వచ్చేసి మంత్రి బొత్స సత్యనారాయణ వర్గం. కాబట్టి శంబంగికే టికెట్ ఇవ్వాలని బొత్స కోరుతున్నారు. వ్యతిరేకత ఉన్నందున ఆగాలా? లేదంటే బొత్సపై నమ్మకంతో ఆయనకే టికెట్ ఇవ్వాలా? అనేది వైసీపీ అధిష్టానం తేల్చుకోలేకపోతోంది.
మూడు సార్లు టీడీపీ నుంచి విజయం..
విజయనగరం జిల్లా మొత్తం వైసీపీ అధినేత అయితే బొత్సకే వదిలేశారు. ఆయన సలహా మేరకే ఆ జిల్లాలో ఏ మార్పు అయినా జరుగుతోంది. ఆసక్తికర విషయం ఏంటంటే శంబంగి నాలుగు సార్లు ఇప్పటికి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే.. మొదటి మూడు సార్లు టీడీపీ నుంచే విజయం సాధించారు. నాలుగో సారి వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి విజయం సాధించారు. కానీ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన శంబంగిపై ఆటోమేటిక్‌గానే వ్యతిరేకత పెరిగింది. బొబ్బిలి రాజులు టీడీపీలో చేరినా.. ఎవరు ఏం చేసినా బొత్స వ్యూహాల ముందు నిలవలేరనే ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు. టీడీపీ మాత్రం పరిస్థితులన్నింటినీ తమకు అనుకూలంగా మార్చుకుని మరీ ముందుకెళుతోంది. ప్రస్తుత తరుణంలో బొబ్బిలిలో టీడీపీని ఎదుక్కోవాలంటే కష్టమే. మరి బొత్స ఏం చేస్తారో చూడాలి.
Can Botsa Satyanarayana survive TDP?:
Botsa Satyanarayana vs TDP