Sports

Can Ruturaj Gaikwad Live Upto The Expectations Set By CSK Former Captain Mahendra Singh Dhoni Check Details | Ruturaj Gaikwad: గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై ఎలా ఆడనుంది?


Chennai Super Kings IPL 2024: ఐపీఎల్ 2024 ప్రారంభానికి ఒక్కరోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్సీ రూపంలో పెద్ద మార్పు చేసింది. యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌… ధోనీ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాక అతడి కెప్టెన్సీలో జట్టు మునుపటిలా రాణిస్తుందా లేదా అనే ప్రశ్న అభిమానుల మదిలో మెదులుతోంది. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా టైటిల్ గెలవడానికి చెన్నై బలమైన పోటీదారుగానే నిలిచింది.

గత సీజన్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమైంది. చూడండి చెన్నై సూపర్ కింగ్స్ అనుభవానికి కొదవ లేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. వీరి విషయంలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. కెప్టెన్ అయిన తర్వాత జట్టులోని ఆటగాళ్లకు తగినంత అనుభవం ఉందని, కాబట్టి వారి విషయంలో తాను పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని గైక్వాడ్ స్వయంగా చెప్పాడు.

ధోనీ కెప్టెన్సీని మాత్రమే వదిలిపెట్టాడు. అతను జట్టును విడిచిపెట్టలేదు. అటువంటి పరిస్థితిలో ధోనీ కొత్త, యువ కెప్టెన్ గైక్వాడ్‌కు సీజన్ అంతటా సహాయం చేస్తూ కనిపిస్తాడు. కెప్టెన్ గైక్వాడ్‌తో ధోనీ తన అనుభవాన్ని వీలైనంత ఎక్కువ పంచుకోవాలనుకుంటున్నాడు. అయితే ధోనీ అనుభవాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం గైక్వాడ్ బాధ్యత.

2019 నుంచి చెన్నైతోనే…
రుతురాజ్ గైక్వాడ్‌ 2019లో చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో చేరాడు.అతను 2020లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. చాలా కాలంగా ధోనీ కెప్టెన్సీలో ఆడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఎస్ ధోని కెప్టెన్సీపై అతనికి మంచి అవగాహన ఉంటుంది. గైక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై ఎలా రాణిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

సంవత్సరం ముందే సమాచారం…
రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ గురించిన ప్రకటన హఠాత్తుగా వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఎప్పటి నుంచో ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. దాదాపు సంవత్సరం క్రితమే అప్పటి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ విషయం గురించి తనకు చెప్పాడని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. ఇది తనకు సర్‌ప్రైజ్‌గా ఉండకూడదని ముందునుంచే ప్రిపేర్ చేసినట్లు పేర్కొన్నాడు. ఒకప్పుడు తాను, ఫాఫ్ డుఫ్లెసిస్ కలిసి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనింగ్ చేశామని, ఇప్పుడు టాస్‌లో వేర్వేరు జట్లకు కెప్టెన్లుగా ఉండటం కాస్త కొత్తగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 

Also Read: చెపాక్ స్టేడియంలో సత్తా చాటేదెవరు? చెన్నై, బెంగ‌ళూరులో విజ‌యం ఎవరిది? పిచ్‌ ఎలా ఉందంటే?

మరిన్ని చూడండి





Source link

Related posts

Kohli Anushka Couple Dance Video Edited To Kurchi Madathapetti Song

Oknews

Yashasvi Jaiswal Shatters Virender Sehwags Six Hitting Record In Tests

Oknews

Malcolm Marshall forgotten in homeland fans want West Indies to legitimise T20 supremacy with third title

Oknews

Leave a Comment