హైదరాబాద్ లో రెండు రోజుల పాటు సీసీఎల్ మ్యాచ్ లు అలరించనున్నాయి. తెలుగు వారియర్స్ తో తెలంగాణ టూరిజం టై అప్ అయ్యింది. హైదరాబాద్ సిటీ ప్రమోషన్ తో పాటు ఆటగాళ్లకు మద్దతుగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈసారి ట్రోఫీ తమదే అంటున్నారు తెలుగు వారియర్స్ ఆటగాళ్లు.