ByGanesh
Tue 25th Jun 2024 10:03 PM
చిరంజీవి సినిమా అంటే జాతరే. పాత బాక్సాఫీసు రికార్డులకు పాతరే. ఇది అందరికి తెలిసిందే. దశాబ్దాలుగా చూస్తున్నదే. కానీ చిరు తాజా చిత్రం విశ్వంభరపై మాత్రం అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నేటి పాన్ ఇండియా హీరోలతో పోటీ పడుతూ చిరు చేస్తున్న విశ్వంభర ఫ్యాన్స్ లోను, ట్రేడ్ లోను వరల్డ్ వైడ్ గా క్రేజ్ క్రియేట్ చేసుకుంది. అనూహ్యమైన రేంజ్ రప్పించుకుంది. అయితే మన టాపిక్ ఇది కాదు అసలు మేటర్ ఏమిటంటే..
మెగాస్టార్ లుక్ అదరహో
విశ్వంభర సినిమాకు సంబంధించి చిరంజీవి లుక్ అఫీషియల్ గా రిలీజ్ కాలేదు కానీ విశ్వంభర సెట్స్ లో ఆయన కొందరిని కలవాల్సి వస్తోంది. ఆ తరుణంలో, బయటికొస్తున్న ఫొటోల్లో చిరు లుక్ చూసి చిందులేస్తున్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసిన సందర్భంలోను, ఇతర రాజకీయ నాయకులు చిరంజీవి చెంతకి వెళ్లిన సమయంలోను ఆ ఫొటోస్ రాక అనివార్యమైంది. విశ్వంభరలో చిరు లుక్ కనువిందు చేసేస్తోంది. విశ్వంభర కోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అప్పటినుంచే సెన్సేషన్ క్రియేట్ చేసేసిన మెగాస్టార్ చిరు ఇది నీకే సాధ్యం గురు అనిపించేస్తున్నారు.
జగదేక వీరుడు మళ్ళీ రానున్నాడా!
విశ్వంభర లో చిరంజీవి లుక్ చూసిన చాలామంది సీనియర్ జర్నలిస్ట్ లు, సినీ విశ్లేషకులు జగదేక వీరుడు తో పోల్చుతున్నారు. బింబిసార అనే సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన వసిష్ఠ చిరంజీవిని మరోమారు జగదేక వీరుడుగా చూపుతాడని నమ్ముతున్నారు. ఈ సినిమాపై వస్తోన్న ప్రతి వార్త వ్యాపిస్తూనే ఉంది. ప్రతి చిన్న అంశం సంచలనం ఐపోతోంది. ఈ కథ గురించి, సినిమా గురించి ఇంకొన్ని రోజుల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. విశ్వంభర ప్రపంచంలోకి ప్రవేశిద్దాం.
Chiru this is possible for you Guru:
Chiranjeevi New Look From Vishwambhara