CM Jagan Delhi Tour : ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హస్తిన పర్యటనకు వెళ్లారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ కు విద్యుత్ పెండింగ్ బిల్లులతో పాటు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.