ByGanesh
Tue 26th Sep 2023 04:12 PM
కొద్దిరోజులుగా కలర్స్ స్వాతి తన హస్బెండ్ కి విడాకులు ఇవ్వబోతుంది.. తాను నటనలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా సిద్ధమైంది.. అందుకే భర్త తో గొడవపడి స్వాతి విడాకుల కోసం అప్లై చేసింది అంటూ బోల్డన్ని వార్తలు స్వాతి పర్సనల్ మీద లైఫ్ వచ్చాయి. అయితే స్వాతి ప్రస్తుతం మంత్ అఫ్ మధు ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు స్వాతి తన విడాకుల రూమర్స్ పై స్పందించలేదు.
కానీ నేడు మంత్ అఫ్ మధు ప్రెస్ మీట్లో మీడియా వారు కలర్స్ స్వాతిని మీరు మీ భర్తకి విడాకులివ్వబోతున్నారని వార్తలొచ్చాయి దీనికి మీ సమాధానమేమిటి అని అడిగితే.. ఇలాంటి రూమర్స్ కి నాకు సమాధానమివ్వాల్సిన పని లేదు అంటూ తేల్చేసింది. అవి రూమర్స్ అంటున్నారు. ఇలాంటి వాటికి నేను కూడా సమాధానమివ్వను అనేసింది. నేను ఒక యాక్టర్ ని. నాకంటూ పర్సనల్ లైఫ్, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి కదా.. అవి చెప్పను అంటూ నవ్వేసింది.
Colors Swathi Answer Divorce Rumors:
I will not respond to divorce rumors: Swathi