పాన్ ఇండియా మూవీగా నిన్న గురువారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కల్కి 2898 AD చిత్రానికి ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. టాలీవుడ్ క్రిటిక్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రతి క్రిటిక్ కూడా కల్కి కి సూపర్ హిట్ రేటింగ్స్ ఇచ్చారు. బెస్ట్ రివ్యూస్ రాసారు. అయితే కల్కి చిత్రంపై కామన్ ఆడియన్స్ చెబుతున్న లెక్క ప్రకారం కల్కి కి ఆ రేంజ్ రివ్యూస్, ఆ రేంజ్ టాక్ అయితే రాకూడదు.
చాలామంది ఆడియన్స్ కల్కి లో ఏముంది.. కథ లేదు, ఫస్ట్ హాఫ్ చిన్న పిల్లల కోసమే అన్నట్టుగా ఉంది, మ్యూజిక్ లేదు, పాటలు లేవు, గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన వారు ఎందుకొచ్చారో, ఎందుకు వెళ్లారో అర్ధం కాలేదు, బ్రహ్మి తో రెండు డైలాగ్స్ మాత్రమే చెప్పించారు, కామెడీ లేదు ఇదేం సినిమా రా బాబు అంటూ మాట్లాడుతున్నారు.
కానీ కొంతమంది ఫస్ట్ హాఫ్ వీక్ అని ఒప్పుకోవాల్సిందే, అయినా ఇంటర్వెల్ బ్లాక్ సూపర్, విజువల్ వండర్, క్లైమాక్స్ ఇరగదీసాడు.. నాగ్ అశ్విన్ అద్భుతాన్ని తెరపైకి తెచ్చాడు అంటున్నారు.
మరికొందరి అసలు ప్రభాస్ ఇందులో విలనా, హీరోనా అనే అభిప్రాయాలను కాదు డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అమితాబచ్చన్ అశ్వద్ధామగా హీరో లా కనిపించారు. ప్రభాస్ నెగెటివ్ షేడ్స్ ఉన్న విలన్ లా కనిపించాడు.. అందుకే ఈ డౌట్ అంటున్నారు సాధారణ ప్రేక్షకులు. మొత్తం మీద ప్రభాస్ ఓ 20 నిముషాలు స్క్రీన్ మీద కనిపించాడు. మిగతాదంతా అమితాబ్ కనిపించారు. ఈ కల్కికి ఆయనే హీరో అంటున్నారు.
మరి సెకండ్ హాఫ్ లో ప్రభాస్ కేరెక్టర్ అమితాబ్ మాటలకు ఇన్స్పైర్ అయ్యి హీరోగా మారతాడేమో.. అందుకే కల్కి 2 ని కూడా అనౌన్స్ చేసారంటూ మాట్లాడుకుంటున్నారు.