ByGanesh
Tue 26th Mar 2024 01:25 PM
లోకేష్ కనగరాజ్ ని స్టార్ డైరెక్టర్ గా నిలబెట్టిన చిత్రం ఖైదీ. కార్తీ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఖైదీ కథ.. ఓ తండ్రి కూతురుని చూసేందుకు పడిన తపన, ఒక పోలీస్ ఆఫీసర్ డ్రగ్స్ బారిన యువత పడకుండా కాపాడేందుకు చేసిన సాహసం, విలన్ గ్యాంగ్ డ్రగ్స్ తో పాటుగా తమ నాయకుడిని కాపాడేందుకు చేసే ప్రయత్నాలు, ఓ పాప తనని కలుసుకోబోయే వాళ్ళ గురించి ఆరాటపడడం.. స్టూడెంట్స్ పోలీస్ లకి తమవంతు సహాయపడడం, ఇలా ఖైదీ చిత్రంలో ఎన్నో సమస్యలు, ఎన్నో సాహసాలు.ఇక కార్తీ పెరఫార్మెన్స్ ఒక ఎత్తైతే.. లోకేష్ మేకింగ్ మరో ఎత్తు అన్నట్టుగా ఖైదీ అందరి మనసులకి దగ్గరైంది.
దానికి ఖైదీ కి సీక్వెల్ గా ఖైదీ-2 ఉంటుంది అని చెప్పిన లోకేష్ కనగరాజ్ అది వదిలేసి విక్రమ్, మాస్టర్, లియో, రజిని మూవీ అంటూ సినిమాలు చేస్తూ పోతున్నాడు. ఈమధ్యలో ఖైదీ సీక్వెల్ పై ఎలాంటి అప్ డేట్ ఇవ్వని లోకేష్ కనగరాజ్.. తాజాగా సూపర్ క్రేజీ న్యూస్ అందించాడు. తానూ సూపర్ స్టార్ రజినీకాంత్ తో చెయ్యబోయే 171వ సినిమా షూటింగ్ పూర్తయిన నెల రోజుల్లోనే ఖైదీ-2 షూటింగ్ ప్రారంభమవుతుందని లొకేష్ కనగరాజ్ తాజాగా ప్రకటించాడు.
రజిని చిత్ర చిత్రీకరణ పూర్తవ్వడమే ఆలస్యం ఖైదీ-2 ఇంకెంత మాత్రం ఆలస్యం కాదని తెలిపాడు. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ చిత్ర ప్రీ ప్రొడ్యూటీన్ లోబిజీగా వున్నాడు, మరోపక్క రజిని తన 170వ సినిమా సెట్స్ లో ఉంది. అది పూర్తికాగానే లోకేష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఈచిత్రం పూర్తి కాగానే ఖైదీ కి సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. మరి ఇది సూపర్ క్రేజీ న్యూస్ కదా!
Crazy update on Kaithi 2:
Lokesh Kanagaraj shares a key update on Kaithi 2