దిశ, ఫీచర్స్ : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2024 (CUET PG 2024) దరఖాస్తు ఫారమ్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీనికి సంబంధించిన పోర్టల్ ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫారమ్‌లో సవరణలు చేసుకునేందుకు అభ్యర్థులు ఫిబ్రవరి 11 నుండి ఫిబ్రవరి 13 వరకు అర్ధరాత్రి 12 గంటలలోపు అధికారిక వెబ్‌సైట్ pgcuet.samarth.ac.in ద్వారా వారు తమ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేయవచ్చు. CUET PG 2024 పరీక్ష మార్చి 2024లో నిర్వహించనున్నారు.
NTA జారీ చేసిన అధికారిక నోటీసు ప్రకారం అభ్యర్థులు 13 ఫిబ్రవరి 2024 వరకు (రాత్రి 11:50 గంటల వరకు) అప్లికేషన్ సవరణలు చేయడానికి అనుమతించారు. అభ్యర్థులు తమ పేరు, సంరక్షకుని పేరు, ఫోటోగ్రాఫ్, సంతకం, 10వ తరగతి, 12వ తరగతి వివరాలు, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వివరాలలో సవరణలు చేయవచ్చు. అలాగే, అభ్యర్థులు తమ పరీక్ష నగరాన్ని కూడా మార్చుకోవచ్చు. సవరణల కోసం అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ఇమెయిల్ ఐడీ, శాశ్వత చిరునామా, మొబైల్ నంబర్‌ను మార్చుకునేందుకు అవకాశం లేదు.
CUET PG 2024 దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు ఎలా చేయాలి ?
pgcuet.samarth.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి.
అప్లికేషన్ సవరణ లింక్‌పై క్లిక్ చేయండి.
సూచనలను జాగ్రత్తగా చదివి సవరణలు చేసుకోండి.
CUET UG 2024 అడ్మిట్ కార్డ్ ఎప్పుడు విడుదల చేస్తారు ?
CUET PG 2024 పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్ మార్చి 7న విడుదల చేయనున్నారు. పరీక్ష మార్చి 11 నుండి 28 వరకు షెడ్యూల్ చేశారు. పరీక్ష సమయం 1 గంట 45 నిమిషాలు ఉంటుంది. మూడు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుండి 10:45 వరకు, మధ్యాహ్నం 12:45 నుండి 2:30 వరకు అలాగే సాయంత్రం 4:30 నుండి 6:15 వరకు.
సెంట్రల్, స్టేట్, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్శిటీలతో సహా 230 యూనివర్శిటీలు CUET PG 2024 ద్వారా PG అడ్మిషన్‌ను అందిస్తాయని NTA ప్రకటించింది. పాల్గొనే సంస్థలలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, అలహాబాద్ విశ్వవిద్యాలయం, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ మొదలైనవి ఉన్నాయి.