Dcm Van Collided Singer Mangli Car in Hyderabad: ప్రముఖ సింగర్ మంగ్లీకి (Mangli) పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం వ్యాన్ ఢీకొనగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి (Rangareddy) జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరై అర్ధరాత్రి తర్వాత మరో ఇద్దరితో కలిసి కారులో ఇంటికి బయలుదేరారు. హైదరాబాద్ – బెంగుళూరు జాతీయ రహదారిపై వస్తుండగా.. తొండుపల్లి వంతెన వద్దకు రాగానే కర్ణాటకకు చెందిన డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీతో పాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కారు వెనుక భాగం స్వల్పంగా దెబ్బతింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Hyderabad Viral Video: మియాపూర్‌లో చెడ్డీ గ్యాంగ్ కలకలం – ఎలా చోరీ చేస్తున్నారో చూశారా
మరిన్ని చూడండి