ByKranthi
Sat 03rd Feb 2024 09:05 AM
ధన్య బాలకృష్ణ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పరిచయమే. టాలీవుడ్‌లో ఆమె కొన్ని చిన్న చిన్న సినిమాలలో ప్రధాన పాత్రలోనూ, స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించింది. ప్రస్తుతం ఈ భామపై ఓ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంది. అది అలాంటిలాంటి సినిమా కూడా కాదు.. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా. ఇందులో ధన్య బాలకృష్ణ.. ఇద్దరు హీరోయిన్లలో ఒకరుగా నటించింది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ధన్య.. గతంలో ఓ సందర్భంలో తమిళ నాడుపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ స్క్రీన్ షాట్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. అలాంటి ఆమె నటించిన ఈ సినిమాను మేము చూడమంటూ.. తమిళ ప్రేక్షకులు బ్యాన్ లాల్ సలాం అనే ట్యాగ్‌ని వైరల్ చేస్తున్నారు. దీంతో ఫిబ్రవరి 9న రావాల్సిన లాల్ సలామ్ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే తన వల్ల ఒక సినిమాకు ప్రాబ్లమ్స్ రావడంతో.. ధన్య బాలకృష్ణ వెంటనే రియాక్ట్ అయింది. ఆ స్ర్కీన్ షాట్‌లో చేసిన వ్యాఖ్యలు తనవి కావని, ఎవరో తనని ట్రోల్ చేయడానికి అలా సృష్టించారని చెప్పుకొచ్చింది. 12 సంవత్సరాల క్రితం కూడా ఇదే మాట చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నానంటూ.. ఆ సందేశంలో ఉన్న వ్యాఖ్యలు నేను చేసినవి కాదు.. అలా నిరూపించడానికి నా దగ్గర ఆధారాలు కూడా ఏమీ లేవు అని ధన్య ఆవేదన వ్యక్తం చేసింది.
నేను తమిళ నటిగానే కెరీర్ ప్రారంభించాను. అలాంటిది నేను ఎలా కామెంట్స్ చేస్తాను. నాకు ఫుడ్ పెడుతోన్న సినీ పరిశ్రమపై ప్రామిస్ చేసి చెబుతున్నా.. ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు. నన్ను ట్రోల్ చేయడానికి ఎవరో దానిని క్రియేట్ చేశారు. ఇన్నాళ్లూ నేను ఈ విషయంపై మౌనంగా ఉండటానికి కారణం కొందరు మా ఫ్యామిలీని బెదిరించారు. ఫ్యామిలీ క్షేమం కోసం కామ్‌గా ఉన్నాను అంతే. అయినా సరే.. నేను చేయని వ్యాఖ్యల గురించి.. నా పేరు మీద వచ్చిన వ్యాఖ్యలతో తమిళ ప్రేక్షకులకు ఇబ్బంది కలిగింది కాబట్టి.. అలా ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. అలాగే నా కారణంగా ఇబ్బందులు పడుతున్న లాల్ సలామ్ చిత్రయూనిట్‌కు, రజనీ సార్‌కి, ఐశ్వర్య మేడమ్‌కు కూడా క్షమాపణలు చెబుతున్నాను.. అని ధన్య చెప్పుకొచ్చింది.
Dhanya Balakrishna on Lal Salaam Controversy :
Dhanya Balakrishna Says Sorry to Tamil Audience and Lal Salaam Team