ByGanesh
Tue 09th Apr 2024 10:30 AM
విజయ్ దేవరకొండ తో సినిమా చెయ్యాల్సిన దిల్ రాజు ఏ మాస్ మూవీనో ఎంచుకోకుండా విజయ్ తో కుటుంబ కథా చిత్రానికి శ్రీకారం చుట్టారు. గీత గోవిందం కాంబోని రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ ని రూపొందించారు. దిల్ రాజు కూడా తన స్టయిల్లో సినిమాని ప్రమోట్ చేసారు. అందరికి ఫ్యామిలీ స్టార్ రీచ్ అయినట్లే కనిపించింది. గత శుక్రవారం సినిమా విడుదలైంది. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది, ఫస్ట్ బావుంది, సెకండ్ హాఫ్ స్లోగా ఉంది అన్నారు, మ్యూజిక్ బాలేదు అన్నారు, అక్కడి వరకు ఓకె.
కానీ ఫ్యామిలీ స్టార్ విడుదలైన నెక్స్ట్ మినిట్ నుంచే సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ పై, ఫ్యామిలీ స్టార్ పై పనిగట్టుకుని విషం చిమ్మడం స్టార్ట్ చేసారు. ఫ్యామిలీ స్టార్ ప్లాప్ అంటూ హాష్ టాగ్ ట్రెండ్ చేసారు. క్రిటిక్స్ రేటింగ్స్ ఒక వైపు, సోషల్ మీడియా నెగిటివిటీ ఒక వైపు. అసలు దిల్ రాజు చెబుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. విజయ్ దేవరకొండ పై ఎంత పగ ఉందొ అన్నట్టుగా ఫ్యామిలీ స్టార్ ని ఇబ్బంది పెట్టారు.
ఖుషి టైమ్ లోను విజయ్ దేవరకొండ పై సోషల్ మీడియాలో చాలా నెగిటివిటి కనిపించింది. అది ఫ్యామిలి స్టార్ టైమ్ కి మరింత పెరిగింది అనేలా కనిపించింది వ్యవహారం. మరి విజయ్ దేవరకొండ తో సినిమా చేసి యావరేజ్ అనుకున్న సినిమాని.. దిల్ రాజు కి లాభాలు తేకపోయినా.. నష్టం అయితే రాకుండా చేసేదే. కానీ విజయ్ పై నెగిటివిటీ ఫ్యామిలీ స్టార్ కి కష్టం తెచ్చిపెట్టింది. మరి దిల్ రాజు విజయ్ దేవరకొండ వల్ల నష్టపోయాడనే అభిప్రాయాలు ఇప్పుడు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు.
Dil Raju loss due to Vijay Devarakonda?:
Dil Raju loss due to Family Star?