ByGanesh
Mon 15th Apr 2024 11:02 AM
పూరి జగన్నాథ్-హీరో రామ్ ఇద్దరూ ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అవడమే కాదు.. హీరోగా రామ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అటు పూరి జగన్నాథ్ దర్శకుడిగా నిర్మాతగా మళ్ళీ నిలబడ్డాడు. ఆ చిత్రం సూపర్ మాస్ హిట్ అయ్యింది. ఆ తర్వాత పూరి, హీరో రామ్ ఇద్దరి నుంచి ప్రేక్షకుల ముందుకు నిరాశ పరిచే సినిమాలే వచ్చాయి.
ఇప్పుడు ఇస్మార్ట్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అంటూ రామ్-పూరి జగన్నాథ్ మరోసారి బరిలోకి దిగారు. ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తూ షూటింగ్ ని చక్కబెట్టే పనిలో చాలా బిజీగా వున్నారు. కొద్దిరోజులుగా డబుల్ ఇస్మార్ట్ అప్ డేట్స్ పై రామ్ అభిమానులు చాలా వెయిట్ చేస్తున్నారు. అయితే తాజాగా డబుల్ ఇస్మార్ట్ పై ఇప్పుడొక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
డబుల్ ఇస్మార్ట్ ఓటిటి హక్కులు సంబంధించి స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమా ఓటిటి హక్కులు ప్రముఖ్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తుంది.. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది.
Double iSsmart OTT deal set?:
Double iSmart OTT deal finalized?