GossipsLatest News

Eagle Overseas Public Talk ఈగల్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్



Fri 09th Feb 2024 09:35 AM

eagle  ఈగల్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్


Eagle Overseas Public Talk ఈగల్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్

మాస్ రాజా రవితేజ -కార్తీక్ ఘట్టమనేని కాంబోలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈగల్ నేడు ఫిబ్రవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈగల్ మూవీ కి సంబంధింన ఓవర్సీస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తి కాగా.. అక్కడ రవితేజ ఈగల్ ని వీక్షించిన వారు సోషల్ మీడియా ట్విట్టర్ X వేదికగా స్పందిస్తున్నారు. ఒక్కసారి ఈగల్ ఓవర్సీస్ పబ్లిక్ టాక్ పరిశీలిస్తే..

ఈగల్ చూసి థియేటర్ నుంచి బయటికొచ్చిన రవితేజ అభిమాని ఒకరు రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశాడు. రవితేజ రాకింగ్, ఫస్టాఫ్ చాలా బాగుంది. సెకండాఫ్ ఇంకా బాగుంది. ముఖ్యంగా డైలాగ్స్ అదిరిపోయాయి. రవితేజ చెప్పిన డైలాగ్స్ డిక్షన్ మాత్రం సూపర్. రవన్న ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశాడు. ఈగిల్ సినిమా మైండ్ బ్లోయింగ్.. అంటూ మరో నెటిజెన్ స్పందించాడు. రవితేజ బీస్ట్‌గా కనిపించాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. మాస్ మహారాజ్ అదరగొట్టాడు. 

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లుక్స్ వైజ్ గా, యాక్టింగ్ పరంగా ఇరగదీసింది, కార్తీక్ ఘట్టమనేని గ్రేట్ వర్క్ , సూపర్ యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ ఫైర్. క్లైమాక్స్ ఓ రేంజ్‌లో ఉంది,  ఈగిల్ మూవీ బ్లాక్ బస్టర్ రాసుకోండి అంటూ మరో అభిమాని ట్వీట్ చేసాడు. రవితేజ తన ఫెర్ఫార్మెన్స్, యాటిట్యూడ్‌తో ఆకట్టుకొన్నాడు. కథలో పాయింట్ సూపర్ హైలెట్. BGM బాగుంది. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చూపు తిప్పుకోనివ్వని గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. రవితేజ హిట్ కొట్టేసాడు అంటూ ఆయన అభిమానులు చాలామంది ఈగల్ చూసి రియాక్ట్ అవుతున్నారు. మరి ఈగల్ పెరఫార్మెన్స్ ఏమిటో మరికాసేపట్లో రివ్యూలో చూసేద్దాం. 


Eagle Overseas Public Talk:

Eagle Social Media Talk









Source link

Related posts

Bigg Boss Geetu Royal about Shanmukh arrest షణ్ముఖ్ ది తప్పే: బిగ్ బాస్ గీతూ రాయల్

Oknews

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. 'ఆర్ఆర్ఆర్'కి షాకిచ్చిన 'సీతారామం'!

Oknews

సిద్ధార్థ మాల్యా పెళ్లికి విజయ్‌ మాల్యా హాజరవుతారా?

Oknews

Leave a Comment