దిశ, ఫీచర్స్ : చాలా మంది చిప్స్‌ను టేస్టీ అండ్ టైమ్‌పాస్ స్నాక్స్‌గా పరిగణిస్తుంటారు. మూవీస్‌కి వెళ్లినప్పుడు, జర్నీ చేసేటప్పుడు, స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లేటప్పుడు పిల్లలు, పెద్దలు చిప్స్ ప్యాకెట్స్‌ని బ్యాగుల్లో పెట్టుకొని వెళ్తుంటారు. రుచిగా ఉన్నప్పటికీ జంక్ ఫుడ్స్ కాబట్టి ఆరోగ్యానికి అంత మంచిది కాదని, తరచుగా తినడంవల్ల హెల్త్ ఇష్యూస్ రావచ్చునని పోషకాహార నిపుణులు చెప్తుంటారు.
అయితే చిప్స్‌ను తినేవారిలో కొందరు సాల్టీగా ఉండే వాటిని ఇష్టపడితే.. మరికొందరు స్పైసీగా ఉండే వాటిని తింటారు. ఈ రోజుల్లో పిల్లలైతే అసలు వాటిని తినకుండా ఉండలేని పరిస్థితి కూడా చూస్తుంటాం. ఇదంతా పక్కన పెడితే.. బయట కొనుగోలు చేసే ప్యాకేజ్డ్ చిప్స్‌ను మీరెప్పుడైనా పరిశీలించారా? వాటిపై జిగ్ జాగ్ డిజైన్లతో కూడిన గీతలు కనిపిస్తుంటాయి.
చిప్స్‌పై లైన్స్ ఎందుకు ఉంటాయన్న సందేహం చాలా మందికి తలెత్తుతుంది. అయితే ఏదో ఆకట్టుకోవడానికి అలా చేసి ఉంటారని కొందరు అనుకుంటారు. కానీ అసలు కారణం వేరు. పైగా ప్యాకెట్లలోని చిప్స్‌లో మాత్రమే ఈ గీతలు ఉంటాయి. తయారీ సందర్భంగా రుచిగా ఉండేందుకు చిప్స్‌పై మసాలాలు వేస్తారు. కాబట్టి అవి వాటిని అంటిపెట్టుకొని ఉండేందుకు ఈ గీతలను డిజైన్ చేస్తారని మార్కెటింగ్ నిపుణులు చెప్తున్నారు. అందుకే అవి రుచిగానూ ఉంటాయని పేర్కొంటున్నారు.
*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.