Health Care

Eye Twiching: కన్ను అదిరితే అదృష్టమా.. దురదృష్టమా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..


దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే సెడన్‌గా కన్ను కొట్టుకుంటుంది. దీనినే కన్ను అదరడం అని కూడా అంటారు. కొన్నిసార్లు ఎడమ కన్ను, మరి కొన్నిసార్లు కుడి కన్ను అదరడం వంటి అనుభవాలు దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. ఇదే విషయాన్ని ఇంట్లో పెద్దలకో, చుట్టు పక్కల వారికో చెబితే.. అదృష్టం కలిసి వచ్చిందనో, దురదృష్టం వెంటాడుతుందనో చెప్తుంటారు.

ముఖ్యంగా లేడీస్‌కి కుడి కన్ను అదిరితే దరిద్రం చుట్టుకుంటుందని, ఇంట్లో గొడవలు జరుగుతాయని, రాబోయే అపశకునానికి నిదర్శనమని చెప్తుంటారు. ఇక మగవారికైతే కుడి కన్ను అదిరితే మంచిదని, ఎడమ కన్ను అదిరితే దరిద్రం వెంటాడినట్టేనని, లేనిపోని సమస్యలు వస్తాయని చెప్తుంటారు. పైగా ఈ కండ్లు అదిరే సిద్ధాంతం అంతటా ఒకేలా ఉండకపోవచ్చు. ఒక్కో దగ్గర ఒక్కోవైపు కన్ను అదరడాన్ని బట్టి, జెండర్‌ను బట్టి అదృష్టం, దురదృష్టం కూడా మారుతుంటాయి. అయితే ఇప్పటికీ కొందరు నమ్ముతున్నట్టు కన్ను అదడరం వెనుక ఎలాంటి అదృష్టం కానీ, దురదృష్టం కానీ ఉండవని, ఈ నమ్మకాలు మూఢ నమ్మకాలని నిపుణులు చెప్తున్నారు.

నిపుణుల ప్రకారం.. కన్ను అదరడానికి కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చిన్నపాటి జర్క్ ఏర్పడటం, నీరసం, కండ్లు పొడిబారడం వంటి సమస్యలవల్ల సడెన్‌గా ఒక కన్ను అదురుతుంది. అట్లనే కంటి అలెర్జీలు, ఒత్తిడి, నిద్రలేమి తరచుగా ఆల్కహాల్ తీసుకోవడం కారణంగానూ శరీరంలో జరిగే మార్పులు, నరాలపై ప్రభావం కారణంగా అప్పుడప్పుడు కన్ను కొట్టుకోవడం లేదా అదరడం వంటి ఆకస్మిక చర్య జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. కొందరిలో మెదడు నరాలలో లోపం కారణంగా కూడా కూడా రోజుమొత్తంలో ఎక్కువసార్లు ఒక కన్ను గానీ, రెండు కండ్లు గానీ అదరడం వంటివి జరగవచ్చు. కానీ ఇది చాలా అరుదు. ఇక ఎక్కువసేపు ఫోన్, ల్యాప్‌ టాప్, కంప్యూటర్ లేదా టీవీ వంటివి చూసినా కండ్లు ఒత్తిడికి గురై సడెన్‌గా ఏదో ఒక కన్ను కొట్టుకునే చాన్స్ ఉంటుంది. ఇలా కన్ను అదరడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉంటాయి తప్ప అదృష్టాలో, దురదృష్టాలో ఉండవని నిపుణులు అంటున్నారు. కండ్లకు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు, సమస్యలు తలెత్తినప్పుడు కంటి వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Read more…

2-2-2 Rule : బరువు తగ్గాలని అనుకుంటున్నారా? మోస్ట్ ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తున్న పద్ధతి.. 



Source link

Related posts

రాంగ్ పర్సన్‌ సిగ్నల్ అంటే ఏమిటి?.. సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

Oknews

ఏంటీ నీ సరసాలు..?కోతిని రోమాన్స్‌లో ముంచెత్తుతున్న కింగ్ కోబ్రో..వీడియో వైరల్

Oknews

బోర్న్‌విటా హెల్త్ డ్రింక్స్ కాదా?.. అసలు ఇవి పిల్లలకు అవసరమేనా?

Oknews

Leave a Comment