GossipsLatest News

Fighter is now streaming on this OTT platform ఓటీటీలో సందడి చేస్తున్న హృతిక్ ఫైటర్



Thu 21st Mar 2024 12:06 PM

hrithik roshan  ఓటీటీలో సందడి చేస్తున్న హృతిక్ ఫైటర్


Fighter is now streaming on this OTT platform ఓటీటీలో సందడి చేస్తున్న హృతిక్ ఫైటర్

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో హృతిక్ రోషన్, దీపిక పదుకునే జంటగా తెరకెక్కించిన ఫైటర్ భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో విడుదల కాగా.. ఈ చిత్రం మాత్రం అనుకున్నంత అంచనాలు అందుకోలేకపోయింది అనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద ఫైనల్ రన్ లో ఫైటర్ మొత్తం మీద 350 కోట్లు రాబట్టినట్లు సమాచారం. థియేటర్లలో జనవరిలోనే విడుదలైన ప్రేక్షకులని అలరించిన ఫైటర్ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని వెయిట్ చేశారు.

ఫైటర్ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో చేజిక్కించుకుంది. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఫైటర్ ఓటీటీ రిలీజ్ డేట్ మీద బుధవారం అధికారిక ప్రకటన రాగా.. గురువారం అంటే ఈరోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలో రిలీజ్ అయిన ఫైటర్ ని వీక్షించేందుకు ఓటీటీ ఆడియన్స్ పోటీపడుతున్నారు. హృతిక్ రోషన్, దీపిక పదుకునే విన్యాసాలకు హృతిక్ ఫాన్స్ తెగ ఇంప్రెస్స్ అవుతున్నారు. 

మార్చ్ 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఫైటర్ ఒక్క హిందీలోనే స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో తెలుగు అలాగే ఇతర భాషల అడియెన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. మరి తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఎప్పుడు రిలీజ్ కానుందో చూడాలి. 


Fighter is now streaming on this OTT platform:

Hrithik Roshan Fighter is now streaming on this OTT platform









Source link

Related posts

రామ్ చరణ్ 'పెద్ది' గురుంచి అదిరిపోయే న్యూస్!

Oknews

Kajal Aggarwal enjoying her vacation భర్త, కొడుకుతో ఎంజాయ్ చేస్తున్న కాజల్

Oknews

అల్లు అర్జున్‌ అభిమాని కన్నీళ్ళకు అసలు కారణం ఇదే!

Oknews

Leave a Comment