Severe Accident in Suryapeta: తెలంగాణలో (Telangana) గురువారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘోర ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై సూర్యాపేట (Suryapet) హైటెక్ బస్టాండ్ సమీపంలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో సూర్యాపేట పట్టణానికి చెందిన పుట్టా సరిత (41) అనే ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, సూర్యాపేట మండలం లక్ష్మీతండాకు చెందిన రుణావత్ రుక్కమ్మ (63), రెండేళ్ల చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందారు. క్షతగాత్రుల్లో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరో ఘటన
అటు, వరంగల్ (Warangal) జిల్లాలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జనగామ జిల్లా దేవరుప్పుల (Devaruppula) మండలం సింగరాజుపల్లి టోల్ గేట్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kalvakuntla Kavita Bail Petition : కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీర్పు – రౌస్ అవెన్యూ కోర్టులో సుదీర్ఘ వాదనలు
మరిన్ని చూడండి
Source link