Latest NewsTelangana

Former CM KCR directs BRS MLAs dont Stuck in congress party trap by meeting CM Revanth | KCR News: సీఎంను కలిస్తే ట్రాప్‌లో పడే ఛాన్స్! ఇలా చేయండి


KCR directs BRS MLAs: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత కేసీఆర్ కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్ నేతల ట్రాప్ లో ఎమ్మెల్యేలు పడొద్దని సూచించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మేల్యేలు జాగ్రత్తగా ఉండాలని నిర్దేశించారు. మంచి ఉద్దేశంతో సీఎంను కలిసినా కూడా కారెక్టర్ ను బదనాం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. నియోజక వర్గాల అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు. అది కూడా ప్రజల సమక్షంలోనే ఇవ్వాలని కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. 

ప్రతిపక్షంలో ఉన్నామని ఏ ఎమ్మెల్యే కూడా అదైర్యపడొద్దని అన్నారు. అందరూ దైర్యంగా ఉండాలని.. ప్రతిపక్షంలో ఉండటం తప్పు అవ్వదని అన్నారు. మనకు ఏ తొందర లేదని.. కాంగ్రెస్‌ పార్టీకి తగిన సమయం ఇద్దామని అన్నారు. ఇప్పటికిప్పుడు మనం వారిపై పోరాడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్లలో వాళ్లే తిట్టుకుంటారని.. వాళ్లే తమ ప్రతిష్ఠ తగ్గించుకుంటారని అన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత ఈజీ కాదని అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరూ రెడీ కావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందని చెప్పారు. ప్రజలకు బీఆర్‌ఎస్ పార్టీపై నమ్మకం అలాగే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్‌ఎస్‌కు దక్కుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Hyderabad Student in Canada: కెనడాలో కార్డియాక్‌ అరెస్ట్‌తో ప్రాణాలు కోల్పోయిన హైదరాబాద్ విద్యార్ధి

Oknews

స్థలాన్ని మహేష్ బాబు లీజుకు తీసుకున్నాడు.. 2010 నుంచి  థియేటర్ లేదు   

Oknews

Crazy title fix for OG OG కోసం క్రేజీ టైటిల్ ఫిక్స్

Oknews

Leave a Comment