Sports

French Open Badminton 2024 Mens Doubles Satwiksairaj Rankireddy Chirag Shetty Clinch Second Title | French Open 2024: విజయం మనదే, అదరగొట్టిన స్టార్‌ జోడి సాత్విక్‌


Satwiksairaj Rankireddy-Chirag Shetty Clinch Second Title: భారత స్టార్ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (Satwiksairaj Rankireddy-Chirag Shetty) జోడీ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్‌ను కైవసం చేసుకుంది. పురుషుల డబుల్స్‌లో చైనీస్‌ తైపీకి చెందిన లీ జే-హువే-యాంగ్‌ పో-హ్సువాన్‌ జోడీపై 21-13, 21-16 తేడాతో విజయం సాధించారు. మ్యాచ్‌లోని రెండు సెట్లలో ఆధిపత్యం ప్రదర్శించింది భారత్ డబుల్స్ జోడీ.. 37 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఆసియా గేమ్స్‌ ఛాంపియన్‌ లీ, యాంగ్‌ జంటపై వరుస సెట్లలో విజయం సాధించి 21-11, 21-17 పాయింట్ల తేడాతో గెలుపొందారు.  సాత్విక్-చిరాగ్‌ జోడికి ఇది 7వ బీడబ్ల్యూఎఫ్ టైటిల్ కాగా ఫ్రెంచ్ ఓపెన్‌ సూపర్ 750 టైటిల్‌ని గెలవడం రెండవసారి. 2019లో కూడా వీరిద్దరూ ఈ టైటిల్‌ని గెలిచారు.

ఫ్రెంచ్ ఓపెన్‌(French Open)లో ప్రపంచ ఛాంపియన్లను సెమీస్‌లో మట్టికరిపించిన భారత జోడి.. సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో కంగ్ మిన్‌హైక్, సీయో సుఎంగ్జే జోడిపై సునాయసంగా విజయం సాధించింది. 21-13, 21-16తేడాతో  వరుస సెట్లలో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ గెలుపుతో వ‌రుస‌గా మూడోసారి ఫ్రెంట్‌ ఓపెన్‌ ఫైనల్‌లో అడుగు పెట్టిన జోడీగా రికార్టు సృష్టించింది. 

నెంబర్‌ వన్‌ జోడీ
భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ర్యాంకింగ్స్‌లో మరోసారి సత్తా చాటారు. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌(World no1 badminton ranking) కైవసం చేసుకుని తమకు  తిరుగులేదని ఇంకొకసారి నిరూపించారు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న ఈ జోడీ  బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ ప్రకటించిన డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుచుంది. ఈ సీజన్‌లో ఆడిన మలేషియా ఓపెన్‌, ఇండియా ఓపెన్‌లల్లో ఈ జోడి రన్నరప్‌గా నిలిచిన ఈ జంట ఏడాదిన్నర తర్వాత తిరిగి టాప్‌కు చేరింది. సింగిల్స్‌లో ప్రణయ్‌ 8వ ర్యాంక్‌ దక్కించుకోగా లక్ష్యసేన్‌ 19వ స్థానంలో నిలిచాడు.

ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో….
భారత డబుల్స్‌ స్టార్‌ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి సొంతగడ్డపై జరుగుతున్న ఇండియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచారు. టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఆగిపోయినా అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. డబుల్స్‌ సెమీఫైనల్లో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేతలు… మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సోహ్ వూయ్ యిక్‌లపై సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించింది. 21-18 21-14తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్ పోరులో రెండో గేమ్‌లో చివరి 12 పాయింట్లలో 11 పాయింట్లు గెలిచిన సాత్విక్‌-చిరాగ్‌ జోడి విజయం సాధించింది. పైనల్లో సాత్విక్‌-చిరాగ్‌ జోడి… మూడో సీడ్‌, కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్- సియో సీయుంగ్ జేలతో తలపడతారు.

మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టోర్నీలోనూ….
మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నీ(Malaysia Open Super 1000 tournament) ఫైనల్లో సాత్విక్‌–చిరాగ్‌ జోడికి ఓటమి ఎదురైంది. ఫైనల్ వరకూ అద్భుతంగా ఆడిన ఈ ద్వయం తుదిమెట్టుపై బోల్తా పడింది. ప్రపంచ రెండో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టి జోడి… 21-9, 18-21 17-21 తేడాతో చైనాకు చెందిన వరల్డ్‌ నెంబర్‌ వన్‌ జోడీ వాంగ్‌ – లియాంగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో భారత జోడి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

Indias T20 World Cup Glory Celebrations Grand Welcome For Team India In Mumbai Photo Gallery

Oknews

Ind Vs Eng Joe Root Eyes Historic Landmark In Vizag Test

Oknews

Anushka Sharma and Virat Kohli Welcome Baby Boy His Name Is Akaay | Anushka Sharma: మరోసారి తల్లయిన అనుష్క శర్మ

Oknews

Leave a Comment