ByGanesh
Mon 09th Oct 2023 10:35 AM
రామ్ చరణ్ మొన్నామధ్యన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ షూటింగ్ లో జాయిన్ అవ్వగా ఆయన కాలికి దెబ్బతగలడంతో షూటింగ్ కి అద్దంతరంగా ప్యాకప్ చెప్పేసారన్నారు. అయితే ఆ విషయం క్లారిటీ లేకపోయినా రామ్ చరణ్ రీసెంట్ గా ముంబై వెళ్లి అక్కడ సిద్ది వినాయకుడి గుడిలో స్పెషల్ పూజలు నిర్వహించి తన అయ్యప్ప మాల దీక్షని విరమించారు.
అలాగే హైదెరాబాదులో తన కజిన్ వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో పాల్గొన్నాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ కి ప్రిపేర్ అయ్యాడు. ఈరోజు నుంచి హైదరాబాద్ లోనే గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతుంది. శంకర్ అటు ఇండియన్ 2 ఇటు గేమ్ చేంజర్ షూటింగ్స్ చెయ్యడంతో రామ్ చరణ్ మూవీ ఆలస్యమవుతూ వస్తుంది. ఇక ఈ చిత్రం 2025 సంక్రాంతికి విడుదల ఉండొచ్చు అందుకే శంకర్ కూడా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్నారంటున్నారు.
అంటే 2024లో గేమ్ చేంజర్ విడుదలయ్యే అవకాశం లేకపోబట్టే.. ఈ చిత్రానికి సంబందించిన అప్ డేట్ మేకర్స్ ఇవ్వడం లేదు అని తెలుస్తోంది. ఇక కమల్ ఇండియన్ 2 విడుదలయ్యాకే చరణ్ గేమ్ చేంజర్ విడుదల కూడా ఉంటుంది. ఈరోజు నుంచి మొదలు కాబోయే గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా పాల్గొనబోతుంది.
Game Changer update:
Game Changer shooting update