Health Care

gold,business:బంగారం కొనుగోలు చేసేటప్పుడు మోసపోతామేమో అని భయపడుతున్నారా.. మీ కోసమే ఈ చిట్కా


దిశ, ఫీచర్స్ : బంగారం కొనుగోలు చేయాలని ఎవరికి ఉండదు. ప్రతి ఒక్కరూ బంగారు నగలు చేయించుకోవాలని ఆరాట పడుతుంటారు. మరీ ముఖ్యంగా మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు చేయించుకొని, అలంకరించుకోడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రస్తుతం బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ధరలు పెరుగుతూ సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతుంది. దీంతో కొంత మంది ధరలు తక్కువగా ఉన్నప్పుడే బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే? ఏ చిన్న శుభకార్యం జరిగినా? వివాహం జరిగినా తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తుంటారు మన పెద్దవారు. అయితే కొంత మంది బంగారం కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తారు. ఎందుకంటే? అది నకిలీ బంగారమో, నిజమైన బంగారమో మాకు తెలియదు, షాప్ వాళ్లు మోసం చేస్తే ఎలా అని భయపడుతారు. కాగా, అసలు నకిలీ బంగారాన్ని, నిజమైన బంగారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

బంగారంలో కొన్ని కేడీఎమ్ అని 916 అని కొన్ని నెంబర్లు గోల్డ్ పై ఉంటుంటాయి. అయితే దీని బట్టి మనం ఈజీగా బంగారం ధర తెలుసుకోవచ్చు అది ఎలా అంటే? ఈ రోజు బంగారం ధర రూ. 65000 ఉంటే దానిని 999తో డివైడ్ చేయాలంట, తర్వాత బంగారంపై 916 ఉందనుకుంటే దానితో మల్టిప్లై చేయాలి. అప్పుడు వచ్చే రేటే బంగారం ధర. దాని బట్టి మీరు మోసపోకుండా మీ బంగారం కొనుగోలు చేసుకోవచ్చు. ( నోట్ : పై వార్త ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు)



Source link

Related posts

అధిక బరువుతో ఆ సమస్యలు.. తగ్గించుకోకపోతే ప్రాణానికే ప్రమాదం !

Oknews

UPSC CSE 2023 ఫేజ్ 3 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..

Oknews

ఎసిడిటీ తో బాధ పడేవారు వీటిని తప్పనిసరిగా తీసుకోండి

Oknews

Leave a Comment