Telangana

Good news for DSC 2008 Candidates Telangana Cabinet Key Decisions full details | Telangana Cabinet Decisions: డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు



Telangana Cabinet Meeting Updates: హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరికొన్ని గ్యారంటీలు అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇచ్చినట్లు తెలంగాణలోనూ డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. హౌసింగ్ కార్పొరేషన్ పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నారు. 16 బీసీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కసరత్తు చేసినట్లు మంత్రులు పొంగులేటి, శ్రీధర్ రెడ్డి తెలిపారు.
ఇళ్ల పథకంపై త్వరలోనే జీవో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై త్వరలోనే జీవో ఇస్తామని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి తెలిపారు. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తాం అన్నారు. మొదటి విడతగా 4 లక్షల 56 వేల ఇళ్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు 84 శాతం మందికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. 
కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కమిటీలు
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంతో చేసిన విద్యుత్ కొనుగోళ్ల అంశంపై విచారణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అధ్యక్షతన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణ చేపడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సైతం కేబినెట్ చర్చించింది. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలు, నాణ్యతపై రిటైర్డ్ జడ్జి జస్టిస్ పీసీ చంద్రఘోష్ నేతృత్వంలో విచారణకు కేబినెట్ నిర్ణయించింది. విచారణ చేపట్టి చంద్రఘోష్ కమిటీ 100 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు ఇచ్చారు. మరో రెండు రోజుల్లో 93 శాతం రైతులకు రైతు బంధు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.  

మరిన్ని చూడండి



Source link

Related posts

Unemployed Protest | జీవో 46 ర‌ద్దు చేయాలంటూ నిరుద్యోగుల వినూత్న నిర‌స‌న‌ | ABP Desam

Oknews

CM Revanth Reddy : 'రైతు భరోసా' ద్వారా పంట పెట్టుబడి సాయం – కొత్త స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Oknews

Hyderabad Drug Control Administration cancels licenses of two blood banks

Oknews

Leave a Comment