Health Care

HAPPY FATHERS DAY నాన్న..


దిశ, ఫీచర్స్: ఈ లోకంలో స్వార్థం, సొంత ప్రయోజనాలు, తన సంతోషం, తన కోరికలు, తన ఆశలు, తన జీవితం అనేది లేకుండా తాను పడే ప్రతి కష్టం, తాను చేసే ప్రతి పని, తాను సంపాదించే ప్రతి రూపాయి, తాను ఎక్కే ప్రతి మెట్టు తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, వారి సంతోషం కోసం ఉపయోగపడాలి అని కోరుకునే వ్యక్తి నాన్న. నవమాసాలు మోసేది తల్లే కావచ్చు. కానీ, పుట్టిన తర్వాత ఆ బిడ్డను తండ్రి తన తుది శ్వాస వరకు గుండెల మీద పెట్టుకుని మోస్తాడు. ప్రతి బిడ్డ ఈ ప్రపంచాన్ని మొదటగా చూసేది నాన్న భుజాల మీద నుంచే. ఏ తండ్రికైనా కూతురు లోకం కావచ్చు. కొడుకుని తిడుతున్నాడని తప్పుగా అనుకోవద్దు. ఆ తిట్లలో బాధ్యత ఉంటుంది. ఆ కోపంలో ఆవేదన ఉంటుంది. ఆ చిరాకులో తన ప్రేమ ఉంటుంది. తండ్రి గారాబం చేస్తే ఎక్కడ చెడిపోతాడో అనే భయం ఉంటుంది. అలాంటి తండ్రికి మీరు ఈ ఫాదర్స్ డే సందర్భంగా కచ్చితంగా ఇవ్వాల్సిన ఒక బహుమతి ఉంది. మరి నా తరపున మా నాన్నకి ఇచ్చేస్తున్న బహుమతి ఈ కవిత రూపంలో..

నాన్న..

మనకోసం వెలుగుతూ..

మనకోసమే నలుగుతూ..

మన ఉన్నతి కోసం.. పెరుగుతూ.. తరుగుతూ..

పేరు లేని కోరని శిల్పి..

ప్రఖ్యాతులు గా తీర్చిదిద్దే సంకల్పి.. నాన్న..!

తన ఇష్టాలు విడిచి..

మన కష్టాలు తుడిచి..

మన గెలుపు కోసం శ్రమిస్తూ..

మన విజయకేతనం కోసం.. శ్వాసిస్తూ

చిన్న చిన్న జ్ఞాపకాల్ని ఆస్వాదిస్తూ..

నిజం చేసే యంత్రం నాన్న..!

నిజాయితీగా పరితపించే సూత్రం నాన్న..!!

మన పెదవులపై చిరునవ్వు చిరునామా…

మన భవితకి భరోసానిచ్చే వీలునామా…

నాన్న..

కరిగే.. కన్నీరు కానరానియక..

అరుగుతూ.. ముందుకెళ్లే రథచక్రాలు గా నాన్న..

తిరుగుతూనే..సంతోషం పంచే ఆశయ క్షేత్రం గా నాన్న..

స్వలాభం తెలియని స్వార్ధపరుడు నాన్న..

స్వగతం ఎప్పుడో.. మరచిన నిస్వార్థ శక్తి నాన్న..

మన గెలుపే.. తన గెలుపుగా..

మనం ఎదిగితే ఎగిరి గంతులేసే చిన్నారి నాన్న…

సాధించిన ప్రతిసారి …ఆనందభాష్పాలు సాక్షిగా నాన్న…

కురిసే నాన్న..మెరిసే నాన్న..

ఆత్మీయ తోడు నాన్న..

అనంతమైన వేడుక నాన్న..

అలాంటి నాన్న గారికి.. చెప్పుకుందాం..

Happy Father’s day అని శుభాకాంక్షలు.



Source link

Related posts

మీ పిల్లలతో ఇలా డీప్ కనెక్షన్ ఏర్పరుచుకోండి…

Oknews

పెదాలు నల్లగా మారుతున్నాయా.. ఈ నూనెను రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయట..

Oknews

మీ పిల్లల్లో ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే దానికి సంకేతం!

Oknews

Leave a Comment