Latest NewsTelangana

Harish Rao Comments At Medak Assembly Constituency BRS Workers | Harish Rao: బీఆర్ఎస్ అలా చేసింటే, సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలోనే


Harish Rao comments at Medak Assembly Constituency BRS workers: మెదక్: మెదక్ పార్లమెంటులోని 7 అసెంబ్లీల్లో 6 చోట్ల మనమే గెలిచాం, స్వల్పఓట్ల తేడాతోనే పద్మమ్మ ఓడిపోయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) అన్నారు. ఏది జరిగినా మన మంచికేనని, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అర్థమవుతోందన్నారు. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి, ఏవి పాలో, ఏవి నీళ్లో వారికి తేలిసిపోయిందన్నారు. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ.. జ్వరం వచ్చినా మెదక్ మీటింగ్ కదా అని ఓపిక చేసుకుని వచ్చానన్నారు.  బడ్జెట్ లేదని తెలిసినా కాంగ్రెస్ (Congress Party) ప్రజలను ఆశపెట్టి మోసం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. 

పాలన చేతకాక ప్రతిపక్షాలపై వేధింపులు
కాంగ్రెస్ ప్రచారంలో అబద్ధాలు, పాలనలో అసమర్థత కనిపిస్తోందని.. పాలించడం చేతగాక ప్రతిపక్షాలను వేధిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలనే అమలు చేయాలని కోరుతుంటే అసహనంతో ప్రతిపక్షాలపై దాడులు చేయడం సరికాదని హితవు పలికారు. కేసులుపెట్టి బెదిరిస్తున్నారు. మేం కేసులు పెట్టి ఉంటే, సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లలో ఉండేవారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

మెదక్ పార్లమెంటులోని అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. అంటే ప్రజలలో బీఆర్ఎస్ పైనే చాలా నమ్మకం ఉందని మెదక్ ప్రజలు నిరూపించారని చెప్పారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 8 నెలలు దాటినా హామీలను అమలు చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ గెలిచే సరిస్థితి లేదని అక్కడి ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు చెప్పారు, 6 నెలల దాటితే స్థానిక ఎన్నికలు వస్తాయి. ప్రజలే మనల్ని వెతుక్కుని మరీ ఓటు వేస్తారని హరీష్ రావు కార్యకర్తలకు సూచించారు.

కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా ఉచిత కరెంటు రావడం లేదు కదా.. మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోతున్నాయంటూ హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ మోటార్లను రిపేర్ చేసే వ్యాపారం పెరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. జనరేటర్ల వ్యాపారం పెరిగిందని, కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఇదే అన్నారు. రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ కేసీఆర్ బెట్టిన భిక్ష అని, ఎవరికైనా పదవి వస్తే బాధ్యత పెరగాలని భావిస్తాం. కానీ రేవంత్ సీఎం పదవిని కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఇది సబబు కాదన్నారు.

రైతుబంధు 15 వేలకు పెంచలేదు. పదివేలు కూడా సరిగ్గా రావడం లేదు. 2లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. పింఛన్ 4 వేలు పెరగలేదు. వడ్లకు బోనస్ పెరగలేదున్నారు. మహిళలకు 2500 రాలేదు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా పింఛన్ పెంచలేదు. పింఛన్ పెంచడానికి ఏ ప్రక్రియ కూడా అసరం లేకపోయినా ఎందుకు పెంచడం లేదు? అని హరీష్ రావు ప్రశ్నించారు.
వందరోజుల్లో హామీలు నెరవేర్చకపతే కర్రు కాల్చి వాతపెడతారన్నారు. 2 రెండు లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంటు ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఓటు వేయరని కాంగ్రెస్ కు అర్థం కావడం లేదన్నారు. 
ఎలక్షన్ కోడ్ రాకముందే హామీలు అమలు చేయాలి
పార్లమెంటు ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ హామీలను నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మేం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలుచేశాం. కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్ళు కడిగామని వ్యాఖ్యానించారు. ఇంటింటికి మంచినీళ్లు, 11 లక్షలమంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, రైతు బంధు హామీలను ఎన్నికల్లో ఇవ్వకపోయినా అమలు చేశామన్నారు. కరోనా కష్ట సమయంలో సైతం ప్రభుత్వం దగ్గర పైసల్లేకపోయినా బిల్లులు, ఎమ్మెల్యల జీతాలు ఆపి రైతుంబంధు ఇచ్చాం. ఇప్పుడు ఏ సమస్యా లేకపోయినా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదు? అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘రేవంత్ పాలనను కేసీఆర్ పాలనతో పోల్చి చర్చలు పెట్టండి. కాంగ్రెస్ దళితబంధు పక్కన పెట్టింది. గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వడం లేదు, 2 లక్షల సాయం కూడా అందలేదు. కేసీఆర్ ప్రారంభించిన పనులను అడ్డుకుంటున్నారు. వచ్చిన నిధులను వెనక్కి పంపుతున్నారు. ఇదేనా అభివృద్ధి? పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మెదక్‌లో భారీగా ఓట్లు వేయిద్దాం. పద్మమ్మ ఓడిపోయినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కాంగ్రెస్ హామీలపై చర్చ పెట్టాలి. ఇచ్చిన హామీలు అమలు చేసేదాక ప్రభుత్వం మెడలు వంచుతాం. అసెంబ్లీలో ప్రజల పక్షాన కొట్లాడుతాం. కార్యకర్తలు అధైర్యపడొద్దు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. మెదక్‌లో గులాబీ జెండా ఎగరేస్తాం’ అన్నారు హరీష్ రావు.



Source link

Related posts

చరణ్ సరసన జాన్వీ కపూర్ కన్ ఫర్మ్

Oknews

Astonishing Poster Of Game Changer గేమ్ ఛేంజర్ నుంచి దసరా సర్ ప్రైజ్

Oknews

ITR 2024 Income Tax ITR Filing For FY 2023 24 Check These Changes In It Return Forms

Oknews

Leave a Comment