Venkata Ramana Reddy: హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లను ఓడించిన కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని తన మనసులో మాట బయటపెట్టారు. రేపొద్దున తాను ముఖ్యమంత్రిని అవుతానని, అప్పుడు తన గాళ్ ఫ్రెండ్‌కు కేబినెట్ హోదా ఇస్తానంటూ సంచలనానికి తెరతీశారు. 2028లో తాను సీఎం ప్లాన్ లో ఉన్నానని, ఆ తరువాత వాళ్లను విడిచి పెట్టేది లేదన్నారు. 2028లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ఇటీవల ఎలాగైతే అన్నారో.. ఇప్పుడు మరో ఛాలెంజ్ చేశారు. బీజేపీ అధికారంలోకి రాకపోతే తాను ఎవరికీ ముఖం చూపించనని స్పష్టం చేశారు.
మరిన్ని చూడండి