దిశ, ఫీచర్స్ : ఆరోగ్యానికి మించిన సంపద లేదు అంటారు. అందుకే నిపుణులు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. అయితే కొంత మంది అప్పుడప్పుడు దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. కానీ దానిని చాలా లైట్ తీసుకుంటారు. అయితే కొన్ని సార్లు ఈ దగ్గు వలన కూడా గుండె సమస్యలు రావచ్చు అంటారు. పదే పదే దగ్గు రావడం లేదా, దగ్గు సమస్యల వలన కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఏర్పడుతుందంట. కాగా, ఈ కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండెకు రక్తం సరిగ్గా సరఫరా కాని సమయంలో కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. అయితే ఈ సమస్య అనేది గుండె కవటాల వ్యాధి కారణంగా వస్తుందంట. ఊపిరితిత్తుల నుంచి రక్తం గుండెకు చేరే సమయంలో తీవ్రమైన దగ్గు వస్తుంది. అలాంటి సమయంలో గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
లక్షణాలు :
ఆకలి లేకపోవడం
మతిమరుపు, ఏకాగ్రత కోల్పోవడం
క్రమరహిత హృదయ స్పందన, గుండె దడ
ఊపిరితిత్తుల్లో ద్రవం ఏర్పడటం
విపరీతమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.
లేత గులాబీ లేదా రక్తంతో కూడిన కఫం
అలసట, నీరసం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రతి రోజూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శారీరక శ్రమ తప్పనిసరి, మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం. సమస్య వచ్చిన ప్రతి సారి వైద్యుడిని సంప్రదించి తగిన వైద్య చికిత్స తీసుకోవాలి.