ByGanesh
Fri 19th Apr 2024 12:19 PM
కల్కి 2898 మేకర్స్ పై తీవ్ర ఒత్తిడి మొదలైంది. మే 9 నుంచి ఈ చిత్రాన్నిపోస్టు పోన్ చేస్తే ఏ తేదికి మార్చాలో అనే సందిగ్ధంలో మేకర్స్ కనిపిస్తున్నారు. మరోపక్క కల్కికి సంబందించిన కొద్ది పాటి సిజి వర్క్ పూర్తికావాల్సి ఉందట. అటు ఎలక్షన్స్, ఇటు సిజి వర్క్ పెండింగ్. అందుకే మేకర్స్ కల్కిని ఏ తేదీలో విడుదల చెయ్యాలనే దానిమీద మల్లగుల్లాలు పడుతున్నారట.
అయితే కల్కి డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం మే చివరిలో కల్కి 2898 AD ని విడుదల చెయ్యమని మేకర్స్ పై ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మరోపక్క నిర్మాత అశ్విని దత్ ఎన్నికల రిజల్ట్ వచ్ఛాకే కల్కిని విడుదల చెయ్యాలని భావిస్తున్నట్లుగా మరో టాక్ ఉంది. మే 30 న సినిమాని విడుదల చెయ్యాలంటే.. ఇండియాలోని పలు భాషల్లో సినిమాని ప్రమోట్ చెయ్యాలి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ హీట్ ఉంటుంది. అప్పుడు ఇబ్బంది అవుతుంది అని కూడా మేకర్స్ ఆలోచన చేస్తున్నారట.
అసలు సరైన తేదీ కోసం కల్కి మేకర్స్ తీవ్ర ఆలోచనలో ఉన్నట్లుగా సోషల్ మీడియా టాక్. మరి ఈ ఒత్తిడి నుంచి మేకర్స్ బయటికొచ్చి ఎప్పుడు రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేస్తారా అని ప్రభాస్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Heavy pressure on Kalki makers:
Kalki 2898 AD new release date soon