Sports

Hockey India CEO Elena Norman Resigns after 13 Years Leadership | Hockey India CEO Resigns: జీతం ఇవ్వ‌ట్లేదంటూ


Hockey India Ceo Resignes For Non Payment Of Dues: హాకీ ఇండియాకు మ‌రో షాక్ త‌గిలింది. జట్టు  సీఈఓ గా ఉన్నఎలెనా నార్మన్‌ (Elena Norman) రాజీనామా చేసింది. హాకీ ఇండియా పనితీరు ప‌ట్ల ఎలెనా కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉంది. మరోవైపు  గ‌త మూడు నెల‌లుగా ఆమెకు జీతం అందలేదు. దీంతో  ఎలెనా రాజీనామా నిర్ణయం తీసుకుంది. 

భారత మహిళల హాకీ జట్టుకు మరో షాక్‌ తగిలింది. మ‌హిళ‌ల జ‌ట్టు చీఫ్ కోచ్ జ‌న్నెకె స్కాప్‌మ‌న్ ప‌ద‌వి నుంచి వైదొలిగిన రెండు రోజుల‌కే సీఈఓ ఎలెనా నార్మన్‌ ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా 13 ఏండ్లుగా హాకీ ఇండియా కోచ్‌గా సేవ‌లందించింది. అయితే హాకీ ఇండియా పనితీరు ప‌ట్ల ఎలెనా కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉంది. దానికి తోడూ స‌మ‌యానికి ఆమెకు గత 3 నెలలుగా శాల‌రీ లేదు. దాంతో, ఆమె సీఈఓ ప‌ద‌వికి రిజైన్ చేసింది.

ఎలెనా రాజీనామాను హాకీ ఇండియా అధ్య‌క్షుడు దిలీప్ ట‌ర్కీ ఆమోదించాడు. హాకీ ఇండియాకు ఎలెనా చేసిన సేవల్ని దిలీప్ కొనియాడాడు.  ఎలెనా హయాంలో భార‌త పురుషుల‌, మ‌హిళల జ‌ట్లు అత్యుత్త‌మ ర్యాకింగ్స్ సాధించాయని, ఎలెనా సుమారు13 సంవత్సరాలు గా ఎంతో నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసినందుకు ఆమెకు ధ‌న్య‌వాదాలు తెలిపాడు.

కొద్ది రోజుల క్రితం భారత మహిళల హకీ జట్టు కోచ్‌(Indian womens hockey coach) షాప్‌(Janneke Schopman) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మహిళలను గౌరవించే దేశం నుంచి వచ్చానని. కానీ అదే గౌరవాన్ని తాను ఇక్కడ పొందలేకపోతున్నాని నెదర్లాండ్స్‌కు చెందిన షాప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో మహిళలకు చాలా గౌరవం ఇస్తారని కానీ హాకీ ఇండియా తనకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని ఆరోపించారు. భారత్‌లో పని చేయడం ఎంతో కష్టమని  కూడా షాప్‌ మన్‌ అన్నారు. భారత మహిళల కోచ్‌గా రెండున్నరేళ్ల తన పదవీ కాలంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని ఈ మాజీ దిగ్గజ క్రీడాకారిణి వాపోయింది. భారత్‌లో తాను ఎంతో ఒంటరిగా ఫీలవుతున్నానని వెల్లడించింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన నెదర్లాండ్స్‌ జట్టులో సభ్యురాలైన షాప్‌మెన్‌… హాకీ ఇండియా మహిళల జట్టుపై పక్షపాతం చూపుతోందని విమర్శించింది. పురుషుల జట్టును ఒకలా…. మహిళల జట్టును ఇంకోలా చూస్తోందని మండిపడింది.

నెదర్లాండ్స్‌కు చెందిన స్కాప్‌మన్‌ 2020 జనవరిలో అనలిటికల్‌ కోచ్‌గా భారత జట్టులో చేరింది. టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత ఆమె చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టింది. స్కాప్‌మన్‌ ఆధ్వర్యంలో భారత జట్టు 2022 ఆసియా కప్‌, కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కాంస్య పతకం నెగ్గింది. అయితే.. ప్రతిష్ఠాత్మకమైన ప్యారిస్‌ ఒలింపిక్స్‌ బెర్తు సాధించలేక పోయింది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే స్కాప్‌మ‌న్, ఎలెనా రాజీనామాల‌తో హాకీ ఇండియాలో అస‌లు ఏం జ‌రుగుతోంది? అని అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.  

మరిన్ని చూడండి



Source link

Related posts

Under 19 World Cup 2024 Will The World Cup Final Be Between India And Pakistan

Oknews

IND vs ENG How has Virat Kohli performed in T20 World Cup knockout matches

Oknews

West Indies vs Afghanistan T20 World Cup 2024 West Indies beat Afghanistan by 104 runs

Oknews

Leave a Comment