Holi in telugu states: తెలుగు రాష్ట్రాల్లో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడా చూసిన రంగులే కనిపిస్తున్నాయి.చిన్నా పెద్దా అంతా కలిసి వేడుకల్లో పాల్గొంటున్నారు. రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రజలంతా… సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే.. రంగులు పట్టుకుని ఒకరిపై ఒకరు చల్లుకుంటున్నారు. ప్రధాన నగరాల్లో అయితే… ఓ ప్రాంతంలో అందరూ గ్యాదరై… హోలీ జరుపుకుంటున్నారు. తెల్లదుస్తులు ధరించి… పండుగ జరుపుకుంటున్నారు. రంగుల చల్లుకోవడంతో… తెల్ల దుస్తులు కూడా రంగులమయంగా మారిపోతున్నాయి.
ప్రతి ఏడాది ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగను హోలికా పూర్ణిమ అని కూడా పిలుస్తారు. రంగుల పండుగ అయితే హోలీ అంటే.. అందరికీ ఇష్టమే. అన్ని వర్గాల వారు ఈ పండుగ జరుపుకుంటారు. చిన్న, పెద్దా తేడా లేకుండా… అంతా కలిసి హోలీ సంబరాల్లో మునిగితేలుతారు. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా హోలీ సంబరాలే కనిపిస్తున్నాయి. ఉదయం నుంచే రంగులతో వీధుల్లోకి వచ్చేశారు ప్రజలు. స్నేహితులు, బంధువులపై రంగులు చల్లుకుంటూ… తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. రాజకీయ నేతలు కూడా తామేమీ తక్కువ కాందంటూ హోలీ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. రంగుల్లో మునిగి తేలుతున్నారు.
బండి సంజయ్ హోలీ సంబరాలు
కరీంనగర్‌లోనూ హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నారులతో ఆడుతూ… పెద్దలకు రంగులు పూస్తూ.. హోలీ సంబరాల్లో మునిగితేలారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. పారిశుధ్య కార్మికులు, ఆటో డ్రైవర్లు, కూలీలతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఈరోజు ఉదయమే బండి సంజయ్ ఇంటి దగ్గరకు బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు చేరుకున్నారు. బండి సంజయ్‌పై రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత సతీమణితో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు బండి సంజయ్. అభిమానులు, కార్యకర్తలు, నాయకులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. బైక్‌పై గల్లీ గల్లీ తిరుగుతూ కనిపించిన వారిందరికీ రంగులు పూశారు. దారిలో కన్పించిన పారిశుధ్య కార్మికులకు కూడా రంగులు పూసి ఆప్యాయంగా పలకరించారు. వారందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఆటో డ్రైవర్లు, కూలీలు, చిరు వ్యాపారుల దగ్గరకు వెళ్లి రంగులు పూశారు. చిన్నపిల్లలతో కలిసి హోలీ ఆడారు బండి సంజయ్.
తెలంగాణలో రాజకీయ నేతల హోలీ సంబరాలు
బీఆర్‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా హోలీ సంబరాల్లో పాలుపంచుకున్నారు. చిన్నారులతో కలిసి రంగులు చల్లుకుంటూ ఫుల్ జోష్‌లో కలినిపించారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేంద్రనాధ్ ఆఫీసులు హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులతో కలిసి పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. కొల్లాపూర్‌లో బైక్‌పై తిరుగుతూ వ్యాపారస్తులకు, ప్రజలకు రంగులు పూస్తూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు కూడా మంత్రి జూపల్లికి రంగులు పూశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం నాగయ్య పల్లి తండాలో ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గిరిజనులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
ఏపీలో రాజకీయ నేతల హోలీ సంబరాలు
మంత్రి అంబటి రాంబాబు హోలీ వేడుకల్లో మునిగితేలారు. సత్తెనపల్లిలో ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. స్థానిక మహిళలు, చిన్నారులతో కలిసి స్టెప్పులు వేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. ఉట్టి కొడుతూ సంబరాలు జరుపుకున్నారు. అంబటి రాంబాబు మాత్రమే కాదు… ఏపీలోని పలువరు రాజకీయ నేతలు కూడా హోలీ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఇక.. ఏపీ సీఎం జగన్… రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
మరిన్ని చూడండి