ByGanesh
Mon 05th Feb 2024 11:41 AM
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, డ్యాన్సింగ్ బ్యూటీ అండ్ టాలీవుడ్ క్రష్ శ్రీలీల ఆయన కుమార్తె తరహా పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. 2023లో సెన్సేషన్‌ని క్రియేట్ చేసిన సినిమాల జాబితాలో భగవంత్ కేసరి చిత్రం టాప్ 5లో నిలుస్తుందడనంలో ఎటువంటి సందేహం ఉండదు. ఈ మూవీకి ముఖ్యంగా లేడీస్ బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే అఖండ విజయాన్ని అందించారు. ఇప్పుడీ సినిమా రీమేక్ రైట్స్ కోసం భారీ క్యూ ఏర్పడినట్లుగా టాక్ వినిపిస్తోంది.
మాములుగానే ఈ మధ్య టాలీవుడ్ చిత్రాల రీమేక్స్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడీ సినిమాపై తమిళ, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోల కన్నుపడిందని తెలుస్తోంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీ నుండి స్టార్ హీరో విజయ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ బ్యానర్ విజయ్‌తో ఓ సినిమా చేయబోతుందనేలా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ కూడా పొలిటికల్ పార్టీ ప్రకటించి.. రాజకీయాలకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో లేడీస్‌లో స్ఫూర్తి నింపే ఇలాంటి చిత్రం.. కాదు కాదు ఇదే చిత్రం అయితే బాగుంటుందని విజయ్ భావిస్తున్నారట. అందుకే డీవీవీ వాళ్లకి ఈ సినిమా రైట్స్ తీసుకోమని చెప్పినట్లుగా టాలీవుడ్ అండ్ కోలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినబడుతోంది. విజయ్‌తో పాటు రజనీకాంత్, అజిత్ వంటి వారు కూడా ఈ సినిమా విషయంలో ఇంట్రస్ట్‌గా ఉన్నారట.
తమిళ సంగతి ఇలా ఉంటే.. కన్నడ స్టార్ హీరోలు సైతం ఈ సినిమా కోసం పోటీ పడుతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్యకు స్నేహితుడు, ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు చూస్తున్నారని, దాదాపు శివరాజ్ కుమార్‌కు ఈ సినిమా రైట్స్ దక్కే అవకాశం ఉందనేలా కన్నడ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం బాలయ్య, శివరాజ్ కుమార్‌ల మధ్య స్నేహమే. మరి ఈ భారీ పోటీలో ఫైనల్‌గా రైట్స్ ఎవరు దక్కించుకుంటారనేది చూడాల్సి ఉంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కింది.
Huge queue for Bhagwant Kesari..!:
Competition for Bhagwant Kesari remake rights