Latest NewsTelangana

Hyderabad BJP leader Bhaskar Goud made a murder attempt and filed a complaint with the police | Hyderabad: అడ్డంగా బుక్కైన బీజేపీ లీడర్! తనపైనే తానే మర్డర్ అటెంప్ట్


Hyderabad News: తెలంగాణ బీజేపీకి చెందిన ఓ నేత తనపై తానే హత్యాయత్నం చేయించుకొని అడ్డంగా దొరికిపోయారు. పోలీసులు ఈ విషయాన్ని గుర్తించి.. మీడియాకు మొత్తం వివరాలు తెలిపారు. హైదరాబాద్ లో బీజేపీ నేత భాస్కర్ గౌడ్ తన మీద తానే హత్య ప్రయత్నం చేసుకుని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చుకున్నారు. తన మీద హత్యాయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. వారు హత్యాయత్నంపై విచారణ చేయగా.. అసలు బండారం బయటపడింది. దీంతో భాస్కర్ గౌడ్ పై పోలీసులు కేసు పెట్టారు.

ఈ ఘటనలో భాస్కర్ గౌడ్ నిందితుడని తెలియడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని ఉప్పల్ పోలీసులు రిమాండ్ తరలించారు. ఈ కేసుపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో మల్కాజిగిరి డీసీపీ పద్మజా ప్రెస్ మీట్ పెట్టి కీలక వివరాలు చెప్పారు. ‘‘భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి బోడుప్పల్ లో నివాసం ఉంటున్నాడు. ఇతను సినీ నిర్మాతగాను, బీజేపీ హిందీ ప్రచార కమిటీ గాను వ్యవహరిస్తున్నారు. అయితే తను సమాజంలో పలుకుబడి కోసం ఈ మర్డర్ ప్లాన్ చేయించుకున్నాడు. తనకు గన్ మేన్లు వెంట ఉంటే సమాజం తనను గౌరవిస్తుందని దురుద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాడు. ఫిబ్రవరి 24వ తేదీన ఉప్పల్ భగాయత్ లో ఈ మర్డర్ ప్లాన్ జరిగింది.

ఈ మర్డర్ ప్లాన్ కోసం రూ.2,50,000 ఒప్పందాన్ని భాస్కర్ గౌడ్ కుదుర్చుకున్నాడు. భాస్కర్ గౌడ్ పై జంట నగరాల్లోని పోలీస్ స్టేషన్ లో ఏడు కేసులు నమోదు అయ్యాయి. వీరివద్ద నుంచి ఇన్నోవా వాహనం, రెండు ద్విచక్ర వాహనాలు, రెండు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నాం. ఈ మర్డర్ ప్లాన్ కు సహకరించి భాస్కర్ గౌడ్ తో పాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించాం’’ అని డీసీపీ పద్మజ తెలిపారు. ఇంకో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆమె చెప్పారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

అప్పుడు చెయ్యాల్సింది ఇప్పుడు చేస్తున్న జగన్

Oknews

YS Sharmila Invitation To Pawan Kalyan పవన్ కళ్యాణ్ ను కలిసిన YS షర్మిల

Oknews

Warangal Mayor Gundu Sudharani Is Likely To Join Congress | Warangal Mayorto Join Congress : కాంగ్రెస్‌లోకి మేయర్

Oknews

Leave a Comment