లౌడ్ స్పీకర్లకు అనుమతి తప్పనిసరి
సభలు,సమావేశాలు నిర్వహించే తేదీ, స్థలం, సమయం ఇతర వివరాలను స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని రోనాల్డ్ రోస్ తెలిపారు. లౌడ్ స్పీకర్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆయన వెల్లడించారు. ఎవరైనా సభకు ఆటంకం కలిగిస్తే పోలీసు అధికారుల సహాయం తీసుకోవాలన్నారు. ప్రచారంలో పాల్గొనాలి అనుకునే కార్యకర్తలు, నేతలు ఐడెంటిటీ కార్డు లేదా గుర్తింపు బ్యాడ్జీలను ధరించాలన్నారు. రాజకీయ నాయకులు పంపిణీ చేసే ఓటరు స్లీప్ లో ఎలాంటి పార్టీ గుర్తు కానీ సింబల్ కానీ ఉండకూడదని రోనాల్డ్ రోస్ స్పష్టం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఎన్నికల సంఘం పరిశీలకులకు, రిటర్నింగ్ అధికారికి, జోనల్, సెక్టార్ మేజిస్ట్రేట్ అధికారులకు ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు.