Latest NewsTelangana

Hyderabad News Well known companies showing interest in undertaking musi riverfront development | Musi River News: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై ప్రముఖ కంపెనీల ఆసక్తి


Musi Riverfront Development Corporation: హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 6) సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఇటీవల లండన్, దుబాయ్ పర్యటనలో ముఖ్యమంత్రి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయ్ లో పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్  సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో ముఖ్యమంత్రి  ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. 

తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ, మూసీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో  చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా సింగపూర్ కు చెందిన మెయిన్హార్డ్ట్(MEINHARDT) కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్లో మూసీ డెవెలప్మెంట్కు అనుసరించాల్సిన  ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. 

అవుటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో  హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ నమూనాలు రూపొందించాలని సూచించారు. మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్, మూసీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ అమ్రాపాలి ఈ భేటీలో పాల్గొన్నారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

Do you recognize Anupama? అనుపమని గుర్తిస్తారా?

Oknews

Weather in Telangana Andhra pradesh Hyderabad on 13 April 2024 Summer heat waves updates latest news here | Weather Latest Update: తెలంగాణలో నేడు కూడా వర్షాలు, ఈ జిల్లాల్లో భారీ గాలులు

Oknews

Bandla Ganesh in Tears ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టిన బండ్ల గణేష్

Oknews

Leave a Comment