Drugs Gang Arrested in Hyderabad Pubs: హైదరాబాద్ (Hyderabad)లో మరోసారి డ్రగ్స కలకలం రేపాయి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ (Jubileehills) లోని పబ్బుల్లో డ్రగ్స్ విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి (Gachibowli) పీఎస్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీ సమీపంలోని డ్రగ్స్ విక్రయిస్తోన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10 గ్రాముల కొకైన్, 13 గ్రాముల ఎండీఎంఏ, 5 సెల్ ఫోన్స్, ఓ కారు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బెంగుళూరు, ముంబై, గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు ఉండగా.. వీరితో పాటు మరో నలుగురు కలిసి గత కొంతకాలంగా డ్రగ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరికి డ్రగ్స్ సప్లై చేసిన నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: New Flyovers: ఒక ఫ్లైఓవర్, మూడు అండర్‌పాస్‌లు.. ఇక ఆ రూట్‌లో యాక్సిడెంట్స్ జరగవట..!
మరిన్ని చూడండి