Lookout Motices against Bodhan Ex MLA Shakeel Ahmed: హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలోని ప్రజా భవన్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మరో పరిణామం జరిగింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా చేర్చారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని డీసీపీ విజయ్ కుమార్ కీలక విషయాలను వెల్లడించారు.
ఈ కేసు విషయంలో డీసీపీ విజయ్ కుమార్ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించారని.. రాహిల్‌తో పాటుగా షకీల్ కూడా దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు వివరించారు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌తోపాటుగా బోధన్ సీఐని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని వివరించారు. వారి కోసం వెతుకుతున్నామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
2022లో మరో యాక్సిడెంట్ కేసు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 2022లో ఎమ్మె్ల్యే కుమారుడు మరో యాక్సిడెంట్ చేసినట్లుగా డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ యాక్సిడెంట్‌లో ఒక బాబు చనిపోయినట్లు వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్‌ను తప్పించారనే వార్తలు వచ్చాయన్నారు. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోందని డీసీపీ విజయ్ కుమార్ వివరించారు.
మరిన్ని చూడండి