Telangana

Hyederabad News: ఫిల్మ్ నగర్ డెక్కన్ కూల్చివేత కేసు


Nampally Court Ordered to File a Case on Actor Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో దగ్గుబాటి వెంకటేశ్ (Daggubati Venkatesh) కు నాంపల్లి కోర్టు (Nampally Court) సోమవారం షాక్ ఇచ్చింది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ హోటల్ కూల్చివేత కేసుకు సంబంధించి వెంకటేశ్, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చేశారని నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రూ.కోట్ల విలువైన భవనాన్ని కూల్చేసి, ఫర్నీచర్ ఎత్తుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులతో కుమ్మక్కై వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ హోటల్ ను కూల్చేయించారని చెప్పారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టి హోటల్ ను ధ్వంసం చేశారని.. దీంతో రూ.20 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. నటుడు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది.
Also Read: Attack on Beggars: సికింద్రాబాద్ లో దారుణం – యాచకులపై కత్తులతో దాడి, ఒకరు మృతి



Source link

Related posts

tsreis has extended tsrjc cet 2024 application dead line check last date and exam schedule here | TSRJC CET

Oknews

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, హెచ్ఆర్ఏ సవరిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటన-hyderabad tsrtc announced hra revision according to new prc ,తెలంగాణ న్యూస్

Oknews

Chiranjeevi makes key comments on Nandi awards renaming as Gaddar awards

Oknews

Leave a Comment