GossipsLatest News

Ileana latest insta post goes viral తల్లయ్యాక ఇలియానా కష్టాలు విన్నారా..



Sun 03rd Mar 2024 05:55 PM

ileana  తల్లయ్యాక ఇలియానా కష్టాలు విన్నారా..


Ileana latest insta post goes viral తల్లయ్యాక ఇలియానా కష్టాలు విన్నారా..

ఏ అమ్మాయైనా తల్లి బంధంలోకి అడుగుపెట్టాక ఆ అమ్మాయికి బాధ్యతలు అమాంతం పెరిగిపోతాయి. బాధ్యతలు కన్నా బిడ్డని చూసుకునేందుకు తగినంత సమయం లేక తమని తాము పట్టించుకోవడానికి కూడా టైమే ఉండదు. పిల్లలకి చూసుకోవడం, ఇంటి బాధ్యతలతో ఒక్కోసారి నిద్ర కూడా సరిపోదు. ఇప్పుడు అదే స్థితిలో గోవా బ్యూటీ ఇలియానా ఉందట. కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న ఇలియానా గత ఏడాది ఓ బిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డ పుట్టాక ఇలియానా డిప్రెషన్ లోకి వెళ్లగా అప్పుడు ఆమెకి తన పార్ట్నర్ మైకేల్ అండగా నిలిచాడని చెప్పింది.

అయితే ఇప్పుడు తన సమయం మొత్తం బిడ్డని చూసుకోవడానికి సరిపోతుంది.. తనని తాను చూసుకోవడానికి కూడా సమయం దొరకడం లేదు అంటుంది. ఒక తల్లిగా బిడ్డని చూసుకోవడానికి, ఇల్లు చక్కబెట్టుకోవడానికే టైమ్ సరిపోవడం లేదు, నా కొడుక్కి నా జుట్టు దొరక్కుండా జుట్టు కొప్పుకట్టుకుని తిరుతున్నాను, అందవిహీనంగా కనబడుతున్నాను, అసలు సెల్ఫీ తీసుకోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు. ఒక్కోసారి కంటి నిండా నిద్ర కూడా ఉండడం లేదు. నేనేమి కంప్లైంట్ చెయ్యడం లేదు.

నాకు తీరిక లేకపోయినా.. నేను సంతోషంగా గడపడానికి నాకో బాబు ఉన్నాడు. డెలివరీ తర్వాత వచ్చే డిప్రెషన్  గురించి పట్టించుకోవక్కర్లేదు. ఆ టైమ్ లో మనకు మనమే తెలియని వాళ్ళలా అవుతాము. 30 నిముషాలు వర్కవుట్స్ చేసి అప్పుడు స్నానం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ వర్కౌట్ కి కూడా సమయం దొరకడం లేదు. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే. డెలివరీ తర్వాత చాలామంది తల్లుల్లా ఎనెర్జీతో కనబడే లిస్ట్ లోకి నేను రాను. నాకు కొంత సమయం పడుతుంది అంటూ ఇలియానా ఓ సెల్ఫీని పోస్ట్ చేసింది.


Ileana latest insta post goes viral:

Ileana took to Instagram and shared a selfie with a long note









Source link

Related posts

మాజీ ముఖ్యమంత్రి మనవడి డేటింగ్ లో ప్రముఖ హీరోయిన్!

Oknews

ఎ.ఆర్‌.రెహమాన్‌ చేసిన దానికి మెగా ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఇదే!

Oknews

Shraddha Srinath For NBK109 NBK109: బాలయ్య సరసన ఆ భామా?

Oknews

Leave a Comment