దిశ, ఫీచర్స్: రోగ నిరోధక శక్తి గురించి ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతుంది. ఇమ్యూనిటీ ఉన్నప్పుడే జలుబు, దగ్గు, ఫీవర్ తోపాటు అనేక రోగాలను శరీరం ఎదుర్కొంటుంది. లేదంటే మనిషి వ్యాధితో మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. అందుకే ఇమ్యూానిటీ ఇంపార్టెంట్ అని చెప్తారు నిపుణులు. రోగ నిరోధక శక్తి పెంచుకునేందుకు తీసుకోవాల్సి ఆహారం గురించి వివరిస్తున్నారు.
* పాలకూర
విటమిన్ ఎ, సి, ఇ లతో కూడిన పాలకూర.. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫ్రీరాడికల్స్ తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది. ఐరన్, మెగ్నీషియం మూలంగా ఉన్న ఈ ఆకు కూర.. సంపూర్ణ ఆరోగ్యానికి మద్దతిస్తుంది.
* బాదం
బాదం విటమిన్ ఇ గొప్ప మూలం. కాగా ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. శక్తి స్థాయిలను పెంచి ఆరోగ్య నిర్వహణకు హెల్ప్ అవుతుంది.
* పసుపు
పసుపులోని యాంటీ ఇన్ ఫ్లమెటరీ పదార్థం కర్కుమిన్ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగిన పసుపు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే హాని నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
* అల్లం
అల్లం యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమెటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. వికారం తగ్గిస్తుంది. హానికారకమైన వ్యాధికారక క్రిములతో పోరాడటం, వాపును తగ్గించడం ద్వారా రోగ నిరోధక శక్తిని
పెంచుతుంది.
* వెల్లుల్లి
వెల్లుల్లిలోని అల్లిసిన్ ఇమ్యునిటీ పవర్ పెంచేందుకు ప్రసిద్ధి చెందింది. ఇది రోగ నిరోధక ప్రతిస్పందనను పెంచుతుంది. రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
* పెరుగు
పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. పేగు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి మూలంగా ఉన్న ఇది పూర్తి ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
* బ్రోకలీ
విటమిన్లు ఏ, సి, ఈ.. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌజ్ బ్రోకలీ. రోగ నిరోధక పనితీరును మెరుగుపరుస్తుంది. డిటాక్సిఫికేషన్ కు మద్దతు ఇస్తుంది. పోషకాలు అధికంగా కలిగి పూర్తి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.