Latest NewsTelangana

Increase in TSPSC Group 2 and Group 3 posts Finance department asks vacancy details | TSPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, పెరగనున్న గ్రూప్‌-2, 3 పోస్టులు


TSPSC: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలో గ్రూప్-2, 3 ఉద్యోగ ఖాళీల సంఖ్య పెరగనుంది. గతంలో ప్రకటించిన పోస్టులకు అదనంగా మరిన్ని ఖాళీలు చేర్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివిధ విభాగాల వారీగా ప్రస్తుతం ఉన్న, వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలను గుర్తించాలని సూచించింది. ఇందుకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఈమేరకు విభాగాధిపతులకు లేఖ రాశారు. ఈ ఏడాదిలో జరగనున్న గ్రూప్-2, 3 పోస్టుల రాతపరీక్షలకు ముందుగానే అదనపు ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని, పోస్టుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు ఉద్యోగార్థులు భావిస్తున్నారు. 

టీఎస్‌పీఎస్సీ 2022లో విడుదల చేసిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మొత్తం 783 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు రాతపరీక్షల తేదీలు గతేడాది నుంచి మూడుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఇక గ్రూప్-3లో 1388 పోస్టులకు ఈ ఏడాది నవంబరు 17, 18 తేదీల్లో నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ షెడ్యూలు ఖరారు చేసింది. 

ప్రస్తుత నోటిఫికేషన్లలోనే ఉద్యోగాల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరీక్షలు జరిగే వరకు పోస్టుల సంఖ్యలో మార్పులు చేర్పులకు అవకాశాలున్నట్లు కమిషన్, ప్రభుత్వం భావిస్తున్నాయి. ఈ సందర్భంగా ఎదురయ్యే న్యాయసమస్యలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఈక్రమంలో వచ్చే ఏడాదిలోగా ఏర్పడనున్న ఖాళీలతో పాటు అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తే వచ్చే అదనంగా వచ్చే పోస్టులపైనా కసరత్తు జరుగుతోంది.

గతంలో గ్రూప్-2 పోస్టుల వివరాలు..

* గ్రూప్-2 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 783

1) మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్-3): 11 పోస్టులు

విభాగం: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్. 

2) అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీవో): 59 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్సెస్ డిపార్ట్‌మెంట్.

3) నాయబ్ తహసిల్దార్: 98 పోస్టులు

విభాగం: ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

4) సబ్-రిజిస్ట్రార్ (గ్రేడ్-2): 14 పోస్టులు

విభాగం: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్.

5) అసిస్టెంట్ రిజిస్ట్రార్: 63 పోస్టులు

విభాగం: కంట్రోల్ ఆఫ్ కమిషనర్- కోఆపరేషన్ & రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్.

6) అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్: 09 పోస్టులు

విభాగం: కమిషనర్ ఆఫ్ లేబర్ డిపార్ట్‌మెంట్.

7) మండల్ పంచాయత్ ఆఫీసర్: 126 పోస్టులు

విభాగం: పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్.

8) ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్: 97 పోస్టులు

విభాగం: ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్.

9) అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 38 పోస్టులు

 విభాగం: హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ డిపార్ట్‌మెంట్.

10) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 165 పోస్టులు

 విభాగం: జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్.

11) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 15 పోస్టులు

 విభాగం: లెజిస్లేటివ్ సెక్రటేరియట్.

12) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 25 పోస్టులు

 విభాగం: ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్.

13) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 07 పోస్టులు

 విభాగం: లా డిపార్ట్‌మెంట్.

14) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 02 పోస్టులు

 విభాగం: తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్. 

15) డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ (గ్రేడ్-2): 11 పోస్టులు

 విభాగం: జువైనల్ కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ డిపార్ట్‌మెంట్. 

16) అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

17) అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 09 పోస్టులు

 విభాగం: ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్. 

18) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్/అసిస్టెంట్ ఎస్సీ డెవలప్‌మెంట్ ఆఫీసర్: 17 పోస్టులు

 విభాగం: ఎస్సీ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్. 

గ్రూప్-2 నోటిఫికేషన్ తదితర వివరాలు..

గతంలో గ్రూప్-3 పోస్టుల వివరాలు..

* గ్రూప్-3 పోస్టులు

పోస్టుల సంఖ్య: 1363

1) జూనియర్ అసిస్టెంట్: 655 పోస్టులు

2) సీనియర్ అకౌంటెంట్: 436 పోస్టులు

3) ఆడిటర్: 126 పోస్టులు

4) సీనియర్ ఆడిటర్: 61 పోస్టులు

5) అసిస్టెంట్ ఆడిటర్: 23 పోస్టులు

6) జూనియర్ అకౌంటెంట్: 61 పోస్టులు 

7) అకౌంటెంట్: 01 పోస్టు

గ్రూప్-3 పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి…



Source link

Related posts

షాకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన 'ప్రేమమ్' డైరెక్టర్

Oknews

'రాజధాని ఫైల్స్' చిత్రానికి జన నీరాజనం

Oknews

sensational things coming out in HMDA Ex director Siva Balakrishna investigation | Siva Balakrishna: శివ బాలకృష్ణ ఏసీబీ విచారణలో సంచలనాలు బయటికి

Oknews

Leave a Comment