2nd T20 IND vs ZIM Match highlights: బ్యాట్‌తో తెలుగు కుర్రాడు అభిషేక్ శర్మ(Abhishek sharma)…. షేక్ ఆడించడంతో తొలి టీ 20లో ఎదురైన పరాజయానికి యువ భారత గట్టిగా ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ 20లో జింబాబ్వే(ZIM)ను వంద పరుగుల తేడాతో టీమిండియా(IND) మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా అభిషేక్ శర్మ, రుతారాజ్(Ruturaj), రింకూసింగ్(Rinku sing) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా పేసర్లు చెలరేగడంతో జింబాబ్వే 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో వంద పరుగల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో అయిదు మ్యాచుల టీ 20 సిరీస్‌లో 1-1తో సమమైంది.
Win in the 2nd T20I
Strong bowling performance
wickets each for @ksmukku4 and @Avesh_6
wickets for Ravi Bishnoi
wicket for @Sundarwashi5
Scorecard
https://t.co/yO8XjNqmgW#TeamIndia | #ZIMvIND pic.twitter.com/YxQ2e5vtIU
— BCCI (@BCCI) July 7, 2024
అభిషేక్, రుతురాజ్ ఊచకోత
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్… బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత మ్యాచ్‌లో జింబాబ్వే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఈ మ్యాచ్‌లో భారత్ పోటీ ఇస్తుందా అన్న సందేహాలు… తొలి ఓవర్‌లోనే పటాపంచలు అయిపోయాయి. గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరిపోయాడు. ఇక మరోసారి భారత్‌కు కష్టాలు తప్పవని అనిపించింది. అయితే అభిషేక్ శర్మ… ఐపీఎల్‌ను తలపిస్తూ చెలరేగిపోయాడు. ఆడుతున్న రెండో అంతర్జాతీయ మ్యాచ్‌లోనే బ్యాట్‌తో చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోసి శతకం సాధించేశాడు. ఆరంభం నుంచే అభిషేక్ చెలరేగిపోయాడు. జింబాబ్వే బౌలర్లపై ఎదురుదాడికి దిగి విరుచుకుపడ్డాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన అభిషేక్… 33 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత అభిషేక్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. మరో 13 బంతుల్లోనే అభిషేక్ సెంచరీ చేశాడంటే ఆ విధ్వంసం ఎలా కొనసాగిందో ఊహించుకోవచ్చు.
తొలి 50 పరుగులకు 33 బంతులు తీసుకున్న అభిషేక్… రెండో 50 పరుగులు చేసేందుకు కేవలం 13 బంతులే తీసుకున్నాడు. మేయర్స్ వేసిన పదకొండో ఓవర్‌లో అభిషేక్ 28 పరుగులు బాదేశాడు. ఆ ఓవర్‌లో అభిషేక్ రెండు భారీ సిక్సర్లు, మూడు బౌండరీలు బాదేసి శతకానికి సమీపించాడు. ఇక మసకద్జ వేసిన 14వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టి శతక గర్జన చేశాడు. కేవలం 47 బంతుల్లో ఏడు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లతో అభిషేక్ శతకం చేసి అవుటయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ 47 బంతుల్లో 77 పరుగులు చేసి మెరుపు బ్యాటింగ్ చేయగా. రింకూ సింగ్ కేవలం రింకూసింగ్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులతో 48 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు చేసింది.
కుప్పకూలిన జింబాబ్వే
తొలి మ్యాచ్‌లో విజయంతో సంచలనం సృష్టించిన జింబాబ్వేకు భారత్ ఏ దశలోనూ మరో అవకాశం ఇవ్వలేదు. తొలి ఓవర్‌లోనే జింబాబ్వే ఓపెనర్‌ను ముఖేష్ కుమార్ అవుట్ చేశాడు. ఇన్నోసెంట్ కైయాను ముఖేష్‌కుమార్ అవుట్ చేశాడు. ఆ తర్వాత మెద్వెవెరె 43, బెన్నెట్ 26 పరుగులు మాత్రమే పోరాడారు. మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు. దీంతో 134 పరుగులకే జింబాబ్వే కుప్పకూలింది. భారత బౌలర్లలో ముఖేష్ కుమార్ 3, ఆవేష్‌ఖాన్ 3 వికెట్లు తీశారు.
మరిన్ని చూడండి