Sports

Indian Chess Player Divya Deshmukh Allegations Against Spectators In Tournament | Divya Deshmukh: ఆట క‌న్నా, అందంపైనే ప్రేక్ష‌కుల ఫోక‌స్


Divya Deshmukh Alleges Sexism By Spectators :  చెస్ టోర్నీ చూసేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు త‌న‌ను వేధింపుల‌కు గురి చేసారంటూ  భార‌తీయ చెస్ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్(Chess Player Divya Deshmukh)సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవ‌ల నెద‌ర్లాండ్స్‌లో జ‌రిగిన టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నీ( Tata Steel Masters Tournament)లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఆమె పేర్కొంది. 

భారత చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ ముఖ్ ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నిర్వహించిన టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టోర్నీలో పాల్గొంది.  అయితే ఈ  చెస్ టోర్నీ వీక్షించేందుకు వ‌చ్చిన ప్రేక్ష‌కులు ఆట మీద ధ్యాస క‌న్నా.. త‌న కురులు, దుస్తులు, మాట‌తీరుపైనే ఫోక‌స్ పెట్టార‌ని దివ్య ఆరోపించింది. చెస్ లో క్రీడాకారిణులు అంటే ప్రేక్షకులకు చులకన భావం ఉందని,  పురుషులు చెస్ ఆడుతుంటే ప్రేక్షకులు వారి నైపుణ్యం గురించి మాట్లాడుకుంటారని, కానీ, మహిళలు చెస్ ఆడుతుంటే ప్రేక్షకుల దృష్టి అంతా ఆ క్రీడాకారిణులు ధరించిన దుస్తులు, ఆమె కట్టుబొట్టు, యాస… ఇలాంటి అనవసర విషయాలపైనే ఉంటుందని దివ్య ఆవేదన వ్యక్తం చేసింది.  అసలు ఆటగాళ్లను ఎందుకిలా పురుషులు, మహిళలు అంటూ వేరు చేసి చూస్తారు? అని ప్రశ్నించింది. అసలు ఇటువంటి అంశాల గురించి ఎప్పట్నించో తాను  మాట్లాడాలనుకుంటున్నానని, కానీ ఇప్పుడు సమయం వచ్చిందని వివరించింది. అంతేకాదు, అసలు తాను ఏ మీడియా ఇంటర్వ్యూకైనా హాజరైనా ఇదే పరిస్థితి అని, ఆట గురించి వదిలేసి, ఇతర విషయాలే ప్రస్తావనకు వస్తుంటాయని అసహనం వ్యక్తం చేసింది.

నాగ‌పూర్‌కు చెందిన 18 ఏళ్ల అంత‌ర్జాతీయ మాస్ట‌ర్ ప్లేయ‌ర్ దివ్య‌.. గ‌త ఏడాది ఏషియ‌న్ వుమెన్స్ చెస్ చాంపియ‌న్‌షిప్ గెలుచుకుంది. ఇప్పుడు ప్రస్తుతం చెస్ లో ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాతో కొనసాగుతోంది. గతేడాది ఆసియా మహిళల చెస్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. అయితే కొన్నిరోజుల కిందట నెదర్లాండ్స్ లోని విక్ ఆన్ జీ నగరంలో జరిగిన చెస్ టోర్నీలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను దివ్య దేశ్ ముఖ్ సోషల్ మీడియా పోస్టు రూపంలో అందరితో పంచుకుంది.   టాటా స్టీల్ మాస్ట‌ర్స్ టోర్నీలో 4.5 స్కోర్‌తో ఛాలెంజ‌ర్స్ సెక్ష‌న్‌లో దివ్య దేశ్‌ముక్ 12వ స్థానంలో నిలిచింది. అప్పుడే త‌న గేమ్ గురించి ఎవ‌రూ మాట్లాడ‌డం లేద‌ని, కేవ‌లం త‌న అందం గురించే ప్రేక్ష‌కులు మాట్లాడుకుంటున్న‌ట్లు  మరోసారి తెలిసిందంది. 

అసలు ఒక్క చెస్ లోనే కాదు, మహిళలు తమ దైనందిన జీవితంలో ఇలాంటివి రోజూ ఎదుర్కొంటూనే ఉంటారని, మహిళలకు ఇకనైనా సమాన గౌరవం ఇవ్వడం మొదలుపెట్టాలని భావిస్తున్నానని దివ్య దేశ్ ముఖ్ తన పోస్టులో పేర్కొంది. 

చిన్న వయసులోనే చెస్ పై ఆసక్తి చూపించిన దివ్య (2012)లో అండర్ 7, (2013, 2014) అండర్ 9, 2015,2016) అండర్ 11, (2017) అండర్ 13, (2017, 2018, 2019) అండర్ 15 టోర్నీల్లో ఛాంపియన్గా నిలిచింది. ఇక 2019లో సీనియర్ టోర్నీల్లో దివ్య.. తాను ఆడిన మొదటిసారే కాంస్యం గెలిచింది.
ఇక కొవిడ్ బ్రేక్ తర్వాత 2022లో నాగ్పుర్ సీనియర్ కేటగిరీలో పాల్గొంది. ఆ పోటీల్లో ఛాంపియన్గా నిలిచి.. సీనియర్ పోటీల్లో గెలిచిన పిన్న వయస్కురాలిగా (16 సంవత్సరాల 7 నెలల 20 రోజులు) రికార్డు సృష్టించింది. 



Source link

Related posts

Indian Premier League 2024 IPL10 Records Know Here

Oknews

PBKS vs SRH IPL 2024 Head to Head records

Oknews

లారా కోసమే ఇదంతా..ఆయనొక్కడే ఆఫ్గాన్ ను నమ్మాడు..

Oknews

Leave a Comment