Sports

Indian Cricket Legend Bishan Singh Bedi Passes Away Due To Prolonged Health Issues | Bishan Singh Bedi: భారత క్రికెట్ దిగ్గజం ఇక లేరు


Bishan Singh Bedi Passed Away: భారత క్రికెట్ మాజీ దిగ్గజం బిషన్ సింగ్ బేడీ ఇక లేరు. బిషన్ సింగ్ బేడీ సోమవారం నాడు అనారోగ్యం కారణంగా మరణించారు. చనిపోయే నాటికి బిషన్ సింగ్ బేడీకి 77 సంవత్సరాలు. 1946 సెప్టెంబర్ 25వ తేదీన బిషన్ సింగ్ బేడీ అమృత్‌సర్‌లో జన్మించారు. 1966 నుంచి 1979 వరకు బిషన్ సింగ్ బేడీ టీమ్ ఇండియాకు ఆడారు. ఆయనన 22 టెస్ట్ మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. బిషన్ సింగ్ బేడీ భారత జట్టులోని స్పిన్ క్వార్టెట్‌లో ఒక భాగం. ఈ స్పిన్ క్వార్టెట్ 1970ల్లో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ చతుష్టయంలో బిషన్ సింగ్ బేడీతో పాటు ప్రసన్న, చంద్రశేఖర్, వెంకట్రాఘవన్ ఉన్నారు.

13 సంవత్సరాల కెరీర్
1966 డిసెంబర్ 12వ తేదీన ఈడెన్ గార్డెన్స్‌‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో బిషన్ సింగ్ బేడీ తన అరంగేట్రం చేశారు. తన చివరి టెస్టును 1979 ఆగస్టు 16వ తేదీన ఇంగ్లండ్‌తో కెన్నింగ్టన్ ఓవల్‌లో ఆడాడు. బిషన్ సింగ్ బేడీ 1974 జులై 14వ తేదీన ఇంగ్లండ్‌పై హెడ్డింగ్లీలో తన వన్డే అరంగేట్రం చేశారు. 1979 జూన్ 16వ తేదీనన ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో శ్రీలంకతో తన చివరి వన్డే ఆడారు.

బిషన్ సింగ్ బేడీ సారథ్యంలోని భారత జట్టు వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ను 406 పరుగుల రికార్డుతో గెలుచుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత బిషన్ సింగ్ బేడీ సారథ్యంలో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతే కాకుండా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్లు తీసి కంగారూలను ఇబ్బందుల్లోకి నెట్టాడు.

బిషన్ సింగ్ బేడీ కెరీర్ ఇలా…
బిషన్ సింగ్ బేడీ భారత్ తరఫున 67 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. తన అంతర్జాతీయ కెరీర్ దాదాపు 13 సంవత్సరాల పాటు కొనసాగింది. బిషన్ సింగ్ బేడీ తన టెస్టు కెరీర్‌లో 266 వికెట్లు పడగొట్టాడు. బిషన్ సింగ్ బేడీ బౌలింగ్ 28.71గా ఉంది. టెస్టు మ్యాచ్‌ల్లో 98 పరుగులకు 7 వికెట్లు పడగొట్టడం ఆయన అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన.

టెస్టు మ్యాచ్‌లో ఒకసారి 10 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అలాగే బిషన్ సింగ్ బేడీ 14 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. టెస్ట్ మ్యాచ్‌లు కాకుండా బిషన్ సింగ్ బేడీ 10 వన్డే మ్యాచ్‌ల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. బిషన్ సింగ్ బేడీ వన్డే ఫార్మాట్‌లో ఏడు వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్‌లో బిషన్ సింగ్ బేడీ సగటు 48.57గా ఉంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial





Source link

Related posts

PKL 10 final Puneri Paltan crowned champions after dominant win over Haryana Steelers

Oknews

Shreyas Iyer All Set To Play For Mumbai In Ranji Trophy Semis Ishan Kishan Participates Dy Patil T20 Cup

Oknews

Ashwin Breaks Muttiah Muralitharans World Record Goes Past Kumble Kapil To Rewrite Indian History In 100th Test

Oknews

Leave a Comment