Latest NewsTelangana

intelligence ex chief ips prabhakar who accused in phone tapping case phoned to higher officer | Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం


Key Twist In Phone Tapping Issue: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు (PraneethRao), మరో ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తాజాగా ఓ ఉన్నతాధికారికి ఫోన్ చేసినట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఈ సందర్భంగా తాను క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. జూన్ లేదా జులైలో తిరిగి హైదరాబాద్ కు వస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ‘ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మీరు ఎలా పని చేస్తున్నారో అప్పటి ప్రభుత్వం చెప్తే మేం కూడా అలాగే చేశాం.’ అని సదరు ఉన్నతాధికారితో అన్నట్లు సమాచారం. అంతే కాకుండా, ఎంతైనా మన పోలీసులం ఒకటని.. మా ఇళ్లల్లో సోదాలు ఎందుకు చేస్తున్నారని కూడా అడిగినట్లు తెలుస్తోంది. అయితే, ప్రభాకర్ రావు ఫోన్ కు స్పందించిన ఉన్నతాధికారి.. ‘మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్ కు  సమాధానం రాసి పంపించండి.’ అని స్పష్టం చేశారట. దీంతో ప్రభాకర్ రావు ఏమీ మాట్లాడకుండానే ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.

కస్టడీ పిటిషన్

మరోవైపు, ఈ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావుతో పాటు నిందితులుగా ఉన్న ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల కస్టడీ కోసం మంగళవారం పిటిషన్ వేయనున్నారు. ఈ ముగ్గుర్నీ కలిపి విచారించాలని అధికారులు భావిస్తున్నారు. అటు, చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని వారు అంగీకరించినట్లు సమాచారం. విచారణలో వెల్లడైన సమాచారం మేరకు నాగోలు మూసీ వంతెన కింద హార్డ్ డిస్క్ ల భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ వ్యవహారం సాగిందని ప్రణీత్ రావు విచారణలో చెప్పారని.. ఈ మేరకు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ లను విచారించేందుకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

కాగా, తొలుత ఎస్ఐబీ ఆధారాల ధ్వంసం కేసులో అరెస్టైన ప్రణీత్ రావును విచారిస్తుండగా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగుచూడడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని ట్యాపింగ్ లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు భుజంగరావు పొలిటికల్ ఇంటెలిజెన్స్ విభాగంలో, తిరుపతన్న ఎస్ఐబీలో అదనపు ఎస్పీలుగా విధులు నిర్వర్తించారు. 

Also Read: Telangana సీఎం రేవంత్ తెరవాల్సింది కాంగ్రెస్ గేట్లు కాదు, ప్రాజెక్టు గేట్లు- లక్షల రైతులతో సెక్రటేరియట్ ముట్టడి: హరీష్ రావు

 

మరిన్ని చూడండి



Source link

Related posts

లావణ్యకు అబార్షన్… రాజ్ తరుణ్ అరెస్ట్?

Oknews

కమెడియన్ ధనరాజ్ దర్శకత్వంలో ‘రామం రాఘవం’.. మరో ‘బలగం’ అవుతుందా!

Oknews

హత్య చేసి మంచంలో పడేశారు.. ఎవరిపనై ఉంటుంది?-medak homicide investigation underway after body found ,తెలంగాణ న్యూస్

Oknews

Leave a Comment