Sports

IPL 2024 GT vs SRH Mohit Sharma Helps GT Restrict SRH To 162per 8 | IPL 2024: గుజరాత్‌ లక్ష్యం 163


Mohit Sharma Helps GT Restrict SRH To 162/8: గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌(SRH) నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గత మ్యాచ్‌లో భీకర బ్యాటింగ్‌తో అలరించిన సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో భారీస్కోర్లు చేయడంలో విఫలమయ్యారు. మంచి ఆరంభాలే దక్కినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా అర్ధ శతకం సాధించలేకపోయాడు. ఈ లక్ష్యాన్ని హైదరాబాద్‌ కాపాడుకోవాలంటే బౌలర్లు రాణించాల్సి ఉంది.

సరైన ఆరంభం దక్కినా…
 ఒమర్జాయ్‌ వేసిన తొలి ఓవర్‌లోనే  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు 11 పరుగులు వచ్చాయి.  ట్రావిస్‌ హెడ్ వరుసగా రెండు ఫోర్లు బాది మరోసారి భారీ స్కోరు అందించెలానే కనిపించాడు. సన్‌రైజర్స్‌ స్కోరు 4 ఓవర్లకు 34 పరుగులు చేరిన సమయంలో తొలి వికెట్‌ కోల్పోయింది. 17 బంతుల్లో 16 పరుగులు చేసిన  మయాంక్‌ అగర్వాల్‌ను అజ్మతుల్లా ఒమర్జాయ్‌ అవుట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అభిషేక్‌ శర్మ… వరుసగా రెండు సిక్సర్లు బాది మంచి టచ్‌లో కనిపించాడు. రషీద్‌ ఖాన్ వేసిన ఆరో ఓవర్‌లో అభిషేక్‌ వరుసగా రెండు సిక్స్‌లు బాదేశాడు. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి హైదరాబాద్‌ 56 పరుగులు చేసింది. ఆ తర్వాత కాసేపటికే హైదరాబాద్‌ రెండో వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ ఔటయ్యాడు. నూర్‌ అహ్మద్‌ వేసిన ఏడో ఓవర్‌లో నాలుగో బంతికి హెడ్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. తర్వాత దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ 29 పరుగులు చేసి అవుటయ్యాడు. మోహిత్ శర్మ వేసిన 10 ఓవర్‌లో చివరి బంతికి అభిషేక్.. శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.10 ఓవర్లకు స్కోరు హైదరాబాద్‌ స్కోరు 74/3. నూర్ అహ్మద్‌ వేసిన 13 ఓవర్‌లో క్లాసెన్‌ వరుసగా రెండు సిక్స్‌లు బాదడంతో స్కోరు వంద పరుగులు దాటింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న హెన్రిచ్‌ క్లాసెన్ 13 బంతుల్లో 24 పరుగులు చేసి రషీద్‌ ఖాన్‌ వేసిన 14 ఓవర్‌లో నాలుగో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. కాసేపటికే హైదరాబాద్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. ఐడెన్ మార్‌క్రమ్ 17 పరుగులు చేసి ఔటయ్యాడు. ఉమేశ్ యాదవ్‌ వేసిన 15 ఓవర్‌లో నాలుగో బంతికి రషీద్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దర్శన్‌ నల్కండే వేసిన 19 ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ స్కోరు 150 దాటింది. చివరికి హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

సమం చేస్తుందా..?
గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్  మధ్య ఇప్పటి వరకు మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో గుజరాత్ 2, హైదరాబాద్ 1 గెలిచాయి. SRHపై GT అత్యధిక స్కోరు 199 పరుగులు. కాగా గుజరాత్‌పై సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు 195 పరుగులు. ఈ మ్యాచులో ఇరు జట్లు కూడా 50 శాతం గెలిచే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్స్‌కు అనుకూలంగా ఉంటుంది.  ఫాస్ట్ బౌలర్లకు పేస్, బౌన్స్ ఉంటాయన్నారు. స్పిన్నర్లకు కూడా సపోర్ట్ లభిస్తుందని వెల్లడించారు.

మరిన్ని చూడండి



Source link

Related posts

India vs south Africa T20 World Cup Final Match preview | India vs south Africa T20 World Cup Final

Oknews

ICC Lift Sri Lanka Crickets Ban With Immediate Effect Two Months After Suspension

Oknews

No10 And No11 Scored A Century For The First Time In 78 Years In First Class Cricket History

Oknews

Leave a Comment