IPL 2024 Telugu News: మొనగాళ్లు – ఐపీయల్ ట్రోఫీ అందుకోవడంప్రతీ ఆటగాడి కల. ఎన్ని కోట్లు పెట్టి కొనుకొన్న ఆటగాడు అయినా… తమ టీం కు ట్రోఫీ దక్కితేనే ఆ ఆనందాన్ని పూర్తిగా అనుభవించగులుగుతాడు. అయితేఇలా ఒకటి కాదు కాదు రెండు కాదు ఏకంగా 6 టైటిళ్లు అందుకొని చరిత్ర సృష్టించారు ఇద్దరు ఆటగాళ్లు. వారే రోహిత్ శర్మ, అంబటి రాయుడు. రోహిత్ ముంబై విజేతగా ఆవిర్భవించినప్పుడు అలాగే డెక్కన్ ఛార్జర్స్ టైటిల్ గెలిచినప్పుడు, రాయుడు ముంబై, చెన్నై టీంలతో ఈ ఘనత సాధించాడు.
ఏబీ.. రికార్డ్ బాయ్
మిస్టర్ 360… ఐపీయల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విభాగంలో 6వ స్థానంలో ఉన్నాడు ఏబీ డివిలియర్స్. 2016 మే 14న గుజరాత్ లయన్స్ మ్యాచ్‌లో ఏబీ ఈ స్కోర్ నమోదు చేశారు. లయన్స్ బౌలర్లని ఓ ఆట ఆడుకొన్నాడు డివిలియర్స్. 12 సిక్స్‌లు 10 ఫోర్లతో డివిలియర్స్ తన ప్రతాపం చూపాడు. పవర్ ప్లే ముగిశాక ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
గిల్‌క్రిస్ట్ వంతు
ఆస్ర్టేలియా సూపర్ వికెట్‌కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ 2008 నుంచి 2013 వరకు ఐపీయల్ ఆడి ఐపీయల్‌లో ఎక్కువ మ్యాచ్ లకు
కెప్టెన్సీ చేసిన ఆటగాడి లిస్ట్ లో ఆరవ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 74 మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ చేసిన గిల్‌క్రిస్ట్ జట్టుకు 35 విజయాలు అందించాడు. ఇందులో 2009 లో డెక్కన్‌ఛార్జర్స్ గెలిచిన టైటిల్ కూడా ఉంది. మొత్తం టీంను ఏకతాటిపైకి తెచ్చి హైద్రాబాద్ కు తొలి టైటిల్ అందించిన ఘనత గిల్లీది.
ప్చ్…. చావ్లా
ఐపీయల్ లోఎక్కువ సార్లు డకౌట్ అయ్యిన ఆరో ఆటగాడిగా కొనసాగుతున్నాడు భారత మాజీ స్పిన్‌బౌలర్ పీయూష్‌చావ్లా. తన కెరీర్‌లో 4 టీంలకు ఆడిన ఈ లెగ్‌స్పిన్నర్ ఐపీయల్ లో 14 సార్లు డకౌట్ అయ్యి ఓ చెత్త రికార్డ్ తనఖాతాలో వేసుకొన్నాడు.
పీయూష్ బ్యాటింగ్ కి వచ్చే సమయానికి టీం దాదాపు కీలక వికెట్లు అన్నీ కోల్పోతుంది
కాబట్టి ఇలా డకౌటవ్వడం ప్రత్యర్ధి టీంకు బలాన్నిచ్చింది అని చెప్పొచ్చు.
మలింగా… రెడీయా…
ఐపీయల్ లోఎక్కువ వికెట్లుతీసిన వారిలో ఆరవ స్థానంలో కొనసాగుతున్నాడు.శ్రీలంక బౌలర్ లసిత్‌మలింగ. 170 వికెట్లు తీసిన మలింగకు ఇందుకు 122 కేవలం ఇన్నింగ్సే అవసరమయ్యాయి. మలింగ 13 పరుగులిచ్చి 5 వికెట్లు కూల్చిన
అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసాడు. దశాబ్ధం పాటు ఐపీయల్ ఆడిన మలింగ 2019లో ఐపీయల్ కి దూరమయ్యాడు. ముఖ్యంగా పవర్‌ప్లే లో 2 ఓవర్లు, చివరలో 2 ఓవర్లు వేసే మలింగ యార్కర్లు అడ్డుకోవడం బ్యాట్స్‌మెన్ కి చాలా కష్టంగా అనిపించేది.
డేవిడ్ భాయ్ బోల్తే….
డేవిడ్ వార్నర్.. ఐపీయల్ అత్యధిక సెంచరీల రికార్డులో 6వ స్థానంలో ఉన్నాడు. 4 సెంచరీలు సధించి గాల్లోకి పంచ్‌లు విసిరాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్న వార్నర్ పవర్‌ప్లేలో రెచ్చిపోతాడు. వార్నర్ క్రీజ్‌లో ఉన్నాడంటే చాలు బంతి బౌండరీ దాటాల్సిందే. సన్‌రైజర్స్ హైద్రాబాద్ టైటిల్ రావడంలో కీలకపాత్ర పోషించిన వార్నర్ ఏకంగా 61 హాఫ్ సెంచరీలు సాధించాడు.
ధనాధన్ ధావన్
టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్‌ధావన్ ఐపీయల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో ఆరవ స్థానంలోఉన్నాడు… 217 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన ఈ లెప్ట్‌హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ 6667 పరుగులు సాధించాడు.106 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. 4 ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిధ్యం వహించిన ధావన్ పవర్‌హిట్టింగ్ ఆటతీరుతో జట్టుకు విజయాలని అందించేవాడు.
వహ్వా..సెహ్వాగ్
ఐపీయల్ లో ఎక్కువ స్ర్టైక్‌రేట్ కలిగిఉన్న ఆటగాళ్లలో 6వ స్థానంలో ఉన్నాడు ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 155.44 స్ర్టైక్‌రేట్ తో 2728 పరుగులు సాధించాడు. తన కెరీర్‌లో మొత్తం 104 మ్యాచ్ లు ఆడిన వీరేంద్రుడు ఈ స్ర్టైక్‌రేట్ కలిగి ఉన్నాడు. 2008-2015 మధ్యకాలంలో ఐపీయల్ ఆడిన సెహ్వాగ్ రిటైర్మెంట్ ప్రకటించి ఇన్నేళ్ళు ఐనా కూడా తన రికార్డ్‌ను ఎవరూ అందుకోలేదు.
ముంబాయా… మజాకా.
ముంబయ్ కి కీలక విజయం కట్టబెట్టింది 2023 ఏప్రిల్ 30 న వాంఖడే స్టేడియంలో రాజస్థాన్‌రాయల్స్ తో జరిగిన మ్యాచ్. మూడు బంతులుమిగిలి ఉండగానే రాయల్స్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఉఫ్ అని ఊదేసింది ముంబై. బ్యాటర్ల సమష్టి కృషితో ముంబయ్ ఈ విజయం నమోదు చేసింది. రాయల్స్ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ సెంచరీతో భారీ స్కోరు చేసినా 4 వికెట్లు కోల్పోయి ముంబై విజయం సాధించింది. ముంబై బ్యాట్స్‌మెన్ లో టిమ్‌డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
చెన్నై కా హుకూం
ఐపీయల్ లో అత్యధిక టీం స్కోర్ విభాగంలో ఆరవ స్థానంలో ఉంది… మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌కింగ్స్. మెదట బ్యాటింగ్ చేసిన చెన్నె ఆరంభం నుంచీ దూకుడుగానే ఆడింది. 2008 ఏప్రిల్ 19న కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్లు కోల్పోయి చెన్నె 240 పరుగులు చేసింది. మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ రికార్డ్ స్కోరు నమోదు చేసింది.
మరిన్ని చూడండి