GossipsLatest News

IPL vs Tillu Square ఓ పక్క IPL మరోపక్క ఫ్యామిలీ స్టార్



Sat 30th Mar 2024 11:20 PM

tillu square  ఓ పక్క IPL మరోపక్క ఫ్యామిలీ స్టార్


IPL vs Tillu Square ఓ పక్క IPL మరోపక్క ఫ్యామిలీ స్టార్

టిల్లు స్క్వేర్ మార్చ్ 29 నిన్న శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసింది. విడుదలయ్యాక మొదటి షోకే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సోషల్ మీడియాలో టిల్లు స్క్వేర్ చిత్రానికి మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో టిల్లు స్క్వేర్ కలెక్షన్స్ కళకళలాడుతున్నాయి. మొదటి రోజు 23.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా మేకర్స్ అఫీషియల్ పోస్టర్ వేసి మరీ ప్రకటించారు. 

టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ లో నిర్మాత నాగ వంశి టిల్లు కలెక్షన్స్ పై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అనేది ఆయన మాటల్లో విన్నారు. టిల్లు స్క్వేర్ 100 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని నమ్మకంగా మీడియా ముందు చెప్పారు. మరి టిల్లు టాక్ చూస్తుంటే  నాగవంశీ నమ్మకం నిజమయ్యేలా కనిపిస్తుంది. ఏ ప్రేక్షకుడు చూసినా టిల్లు భజనే చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఇండియా మొత్తం IPL ఫీవర్ లో కొట్టుకుంటుంది. క్రికెట్ లవర్స్ సాయంత్రమైతే టీవీలకు అతుక్కుపోతున్నారు. గత రెండేళ్లలో ఐపీల్ పై యూత్ లో కాస్త ఇంట్రెస్ట్ తగ్గినట్టుగా అనిపించినా..ఈ ఏడాది మాత్రం యూత్ మొత్తం ఐపీల్ ఫీవర్ తో ఊగిపోతున్నారు. 

మరి ఇలాంటి సమయంలో టిల్లు స్క్వేర్ సాయంత్రం షోస్ ఫుల్ అవుతాయా.. మరోపక్క ఇంకో వారంలో ఫ్యామిలీ స్టార్ తో విజయ్ దేవరకొండ ఎటాక్ చేస్తున్నాడు. ఈ సమయంలో టిల్లు స్క్వేర్ వారం రోజల్లో నాగవంశీ అన్నట్టుగా 100 కోట్లు కొల్లగొడుతుందా.. అనేది అనుమానమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.


IPL vs Tillu Square :

Tillu Square first day collections 









Source link

Related posts

పురాణాల్ని ఢీకొడుతున్న మెగాస్టార్ చిరంజీవి..జనవరి 10 పక్కా కన్ఫార్మ్

Oknews

Karimnagar doctor has gained national recognition for his services to the poor | BN Rao Foundation : వైద్యుడే కానీ పేదల పాలిట దేవుడు

Oknews

CM Jagan Attended Engagement Ceremony Of Sharmila Son Raja Reddy With Priya Atluri | Jagan Sharmila: షర్మిల కొడుకు ఎంగేజ్‌మెంట్‌కు జగన్

Oknews

Leave a Comment