ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు వేళయ్యింది. తమ అభిమాన ఆటగాళ్లు…తమ అభిమాన టీంలు అంటూ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మొత్తం ఈ లీగ్ కోసమే ఎదురుచూస్తున్నారు. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్‌కింగ్స్…. రాయల్‌ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మార్చి 22న జరగబోయే మ్యాచ్‌తో 2024 సీజన్ ఆరంభం కానుంది. అయితే ప్రతీ ఏడాది ఈ లీగ్‌లో రికార్డ్‌లు బద్ధలవుతూనే ఉన్నాయి. కొత్త రికార్డ్‌లు నమోదవుతూనే ఉన్నాయి. ఐపీయల్ కి ఇంకా 10రోజులు మాత్రమే సమయం ఉంది. కాబట్టి ఐపీయల్ లో 10 నంబర్ పేరుమీద ఉన్న టాప్-10 రికార్డ్‌లు ఓ సారి పరిశీలిద్దాం.
బాహుబలి
ఐపీయల్ చరిత్రలో ఇప్పటివరకు టైటిల్ నెగ్గని జట్లు ఉంటే, మరో పక్క 5 టైటిళ్లు గెలిచి అరుదైన రికార్డ్ సాధించాయి చెన్నైసూపర్‌కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్లు. ఏ ఇతర జట్లకి సాధ్యం కాని చరిత్ర మాత్రమే కాదు… ఇప్పటివరకు ప్రపంచ లీగ్ లో ఏ జట్టు కి సాధ్యం కాని రికార్డ్ ఇది. మహేంద్రసింగ్ ధోనీ, రోహిత్ శర్మ సారథ్యంలోని జట్లు ఈ ఘనత సాధించాయి. ఇప్పట్లో వేరే ఏ టీంకు సాధ్యం కాని రికార్డ్ ఇది.
రాహుల్ ధమాకా
కే.యల్.రాహుల్ ఐపీయల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విభాగంలో 5వ స్థానంలో ఉన్నాడు. దుబాయ్‌లో జరిగిన 2020 ఐపీయల్ ఎడిషన్‌లో రాహుల్ 59 బంతుల్లో 133 పరుగులు సాధించాడు. 2015 మే 10న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 14 ఫోర్లతో రాహుల్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 191 స్ట్రైక్‌రేట్ తో ఈ రికార్డ్ సాధించాడు.
డేవిడ్ వార్నింగ్
ఐపీయల్‌లో ఎక్కువ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిలో డేవిడ్‌వార్నర్ ఐదవ స్థానంలో నిలిచాడు. ఐపీయల్ లో విలువైన ఆటగాడిగా కొనసాగుతూ కెప్టెన్సీ కూడా అధ్బుతంగా నిర్వహించడమేకాక 2016లోతను నాయకత్వం వహించిన సన్‌రైజర్స్‌హైద్రాబాద్ ని విజేతగా కూడా నిలిపాడు. మెత్తం ఐపీయల్‌లో 83మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేస్తే 40 మ్యాచ్‌లు టీం గెలిచింది. తను ఆడటమే కాదు జట్టు మొత్తాన్నిఆడించేలా చేయడం వార్నర్ స్పెషాలిటి.
పేలని రషీద్ బాంబ్
ఐపీయల్ లోఎక్కువ సార్లు డకౌట్ అయ్యిన ఐదో ఆటగాడిగా కొనసాగుతున్నాడు మిస్టరీ స్పిన్నర్ కం ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్. ప్రస్తుతం గుజరాత్‌టైటాన్స్ తరఫున కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ ఐపీయల్ లో 14 సార్లు ఖాతా తెరవకుండానే వెనక్కి వచ్చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే రషీద్ ఇలా అవుటవ్వడం టీంను నిరాశపరుస్తుందిఅని చెప్పాలి. ఎందుకంటే, రషీద్ బ్యాటింగ్‌లో చేసే పరుగులు, తన బౌలింగ్‌తో కట్టడి చేసే పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తాయి.
అశ్విన్ మాయ
ఐపీయల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక వికెట్లుతీసిన వారిలో ఐదవ స్థానంలో కొనసాగుతున్నాడు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. 173 వికెట్లు తన ఖాతాలో వేసుకొని 5వ ప్లేస్‌లో ఉన్నాడు. తన క్యారమ్‌బాల్స్ తో బ్యాట్స్‌మెన్ ని బోల్తా కొట్టించడం అశ్విన్ కి సులువనే చెప్పాలి. అంతేకాదు లోయర్ ఆర్డర్‌లో విలువైన పరుగులు చేయగలడు.
షేకింగ్ వాట్సన్
షేన్‌వాట్సన్. ఐపీయల్ మెదటి సీజన్‌లో రాజస్థాన్‌కి, తర్వాత బెంగళూరుకి, తర్వాత చెన్నెతరఫున ఆడిన ఈ ఆల్‌రౌండర్ ఐపీయల్ లో 4 సెంచరీలు బాది ఐపీయల్ లో అత్యధిక సెంచరీల స్థానంలో 5వ ప్లేస్‌లో ఉన్నాడు. ఏ జట్టు తరఫున ఆడినా జట్టు విజయంలోతన పాత్ర అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో ఉండేలా చూసుకొనే వాట్సన్ 2008లో ఐపీయల్‌లో ఎంట్రీ ఇచ్చి 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
5 విలువ
ఐపీయల్ లో ఫోర్లు, సిక్సర్లు అలవోకగా బాదేస్తుంటారు బ్యాటర్లు. ఇక సాహసాలు చేసైనా బౌండరీ దగ్గర బంతి ఆపుతుంటారు ఫీల్డర్లు. ఎందుకంటే గెలుపు, ఓటమిని నిర్ణయించేది ఆ పరుగులే కాబట్టి. 2023 మే 2 న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడిన గుజరాత్ టైటాన్స్ కి అవే పరుగులు పీడకలలా మారాయి. 5 పరుగుల తేడాతో మ్యాచ్ కోల్పోయింది టైటాన్స్. మెదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 130 పరుగులే చేసింది. కానీ తర్వాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 125 పరుగులే చేసింది. చేతిలో ఇంకా 5 వికెట్లు ఉన్నాకట్టుదిట్టమైన ఢిల్లీ ఫీల్డర్ల ముందు బౌండరీలు సాధించలేక 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది గుజరాత్.
రవీంద్రుడు
ఐపీయల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో ఐదో స్థానంలోఉన్నాడు… రవీంద్ర జడేజా. చెన్నైసూపర్‌కింగ్స్ తరఫున బరిలో దిగే జడేజా మ్యాచ్‌లకు దూరమవడం అరుదనే చెప్పాలి. ఇప్పటివరకు ఐపీయల్ లో 226 మ్యాచ్‌లు ఆడిన జడేజా… 2692 పరుగులు చేశాడు. అంతేకాదు… 152 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రాజస్థాన్ రాయల్స్, కోచి టస్కర్స్, గుజరాత్ లయన్స్‌తరఫున ఐపీయల్ ఆడిన జడేజా… గత సీజన్ లో చెన్నె తరఫున ఒకట్రెండు మ్యాచ్‌లకు కెప్టెన్సీ కూడా చేశాడు.
పూరన్ బాదెన్
ఐపీయల్ లో ఎక్కువ స్ర్టైక్‌రేట్ కలిగిఉన్న ఆటగాళ్లలో 5వ స్థానంలో ఉన్నాడు విండీస్ స్టైలిష్ ప్లేయర్ నికోలస్‌పూరన్. కేవలం 59 ఇన్నింగ్స్‌లు ఆడిన పూరన్ 156.79 స్ర్టైక్‌రేట్ తో ఐపీయల్ లో విధ్వంసం సృష్టించాడు. 2019లో ఇండియన్ ప్రీమియర్‌లీగ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ లెఫ్ట్‌హ్యాండర్ పంజాబ్, హైద్రాబాద్, లక్నో తరఫున ఆడాడు. పూరన్ కొట్టే సిక్స్ లే తనకి ఇంత స్ర్టైక్‌రేట్ తెచ్చాయి అంటున్నారు ఫ్యాన్స్.
రైడర్స్ జమానా
ఐపీయల్ లో అత్యధిక టీం స్కోర్ విభాగంలో 5వ స్థానంలో ఉంది… కోల్‌కతా నైట్ రైడర్స్. మెదట పవర్ ప్లేలో చిన్నగా మొదలు పెట్టిన కోల్‌కతా తర్వాత గేరు మార్చుతూ ఇరవై ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు సాధించింది. ఇండోర్ వేదికగా 2018 మే 12న కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కోలకతా ఈ ఫీట్ నమోదు చేసింది. 12.25 రన్ రేట్‌తో కోల్‌కతా ఈ స్కోరు నమోదు చేసింది.
మరిన్ని చూడండి